రాష్ట్రీయం

ఎండలా.. వర్షాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 22 : రోహిణీ కార్తె ఈ నెల 25 న ప్రారంభమై జూన్ 9 వరకు ఉంటుంది. ఈ కార్తెలో ఎండలు మండుతాయా.. వర్షాలు కురుస్తాయా? అన్న ప్రశ్న రైతుల్లో, సాధారణ ప్రజల్లో తలెత్తుతోంది. సాధారణంగా రోహిణిలో విత్తనాల వేసేందుకు అవసరమైన వర్షాలు కురిస్తే రైతుల అదృష్టమే. ఎందుకంటే రోహిణిలో విత్తనాలు పడితే ఆ పంటలకు తెగుళ్ల బాధ పెద్దగా ఉండదు. చాలా సందర్భాల్లో రోహిణీలో ఎండలు మండుతుంటాయి. ‘రోకళ్లు పగిలే ఎండలు రోహిణిలోనే’ అన్న నానుడి ఉంది. ఈ పర్యాయం రోహిణిలో ఎండలు ఎలా ఉంటాయన్న అంశంపై భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకె రెడ్డి ఆదివారం ఇక్కడ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. ప్రస్తుతం నెలకొని ఉన్న వాతావరణ పరిస్థితిలో మరో మూడు రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వేడిగాలులు వీస్తాయని తెలిపారు. రోహిణీ కార్తె ప్రారంభం వరకు ఎండలు ఉంటాయని వివరించారు. రోహిణీ కార్తె ప్రారంభమైన రెండోరోజు నుండి కేరళ, కోస్తాకర్నాటకల్లో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి సైంటిస్ట్ ఎకె బన్సాల్ వెల్లడించారు. నైరుతీ రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ బంగాళాఖాతం, అండమాన్, నిలోబార్ ఐలాండ్స్ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో భారీవర్షాలు ప్రారంభమయ్యాయి. వచ్చే నాలుగైదురోజుల్లో అండమాన్ నిలోబార్ ఐలాండ్స్‌తోపాటు కోస్తా కర్నాటక, కేరళ, అసోం, మేఘాలయ, సిక్కిం, పశ్చిమ బెంగాల్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. నైరుతీ రుతుపవనాలు కేరళ తీరాన్ని జూన్ మొదటి వారంలో తాకే అవకాశం ఉందని వైకె రెడ్డి తెలిపారు. కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఇవి నాలుగైదు రోజుల తర్వాత రాయలసీమ, వారం తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని చేరతాయని వివరించారు.