రాష్ట్రీయం

ఐదు రోజులే పని దినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వచ్చే ఉద్యోగుల పనిరోజులు ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగుల విజ్ఞప్తి పరిగణనలోకి తీసుకుని వెలగపూడిలో నిర్మించే ప్రభుత్వ భవన సముదాయంతోపాటు అమరావతి పరిసరాల్లో పని చేసేందుకు హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలుగా ఖరారు చేశారు. ఉద్యోగులకు శని, ఆదివారాలు సెలవు దినాలు. సోమవారం నుంచి శుక్రవారం వరకూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పని చేయాల్సి ఉంటుంది. బదలీ అంశంపై ఉద్యోగుల కుటుంబీకులకు ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని, ఏడాదిపాటు ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయని పేర్కొన్నారు.
జూన్ 1న కేబినెట్ భేటీ
మే 26న నిర్వహించాల్సిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. దీన్ని వచ్చే నెల 1న నిర్వహించాలని నిర్ణయించారు. తొలుత నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం 24, 25 తేదీల్లో కలెక్టర్ల సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశాన్నీ 25, 26 తేదీల్లో చేపట్టాలని ఆదివారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.