రాష్ట్రీయం

దసరాకే కొత్త జిల్లాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 23: వచ్చే దసరా నుంచే కొత్త జిల్లాలు అమల్లోకి రానున్నాయి. సిఎం ముందుగా ప్రకటించినట్టు కొత్త జిల్లాల పేర్లు జూన్ 2న ప్రకటించే అవకాశం లేదు. ముందుగా హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించి ఆ తరువాతే జిల్లాలను ప్రకటిస్తారు. పరిపాలనా సౌలభ్యం, ప్రజాసౌకర్యం అంశాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరపాలని నిర్ణయించినట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై కలెక్టర్లూ అధ్యయనం జరపాలని సూచించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన జిల్లా కలెక్టర్ల సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు అనుసరించే విధివిధానాలను సిఎం కలెక్టర్లకు వివరించారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయన్నారు. 24, 25 జిల్లాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని, హైదరాబాద్ సహా ఇతర జిల్లాలను ఎలా పునర్వ్యవస్థీకరించాలనే విషయంలో అనేక విధాలుగా ఆలోచిస్తున్నట్టు చెప్పారు. అనేక ప్రతిపాదనలు వస్తున్నాయని, అన్నింటిపై అధ్యయనం జరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు కలెక్టర్లు శాస్ర్తియంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఒక్కో జిల్లాలో నాలుగైదు అసెంబ్లీ నియోజక వర్గాలు, సగటున 20 మండలాలు ఉంటాయన్నారు. జూన్ 2 తరువాత హైదరాబాద్‌లో వర్క్‌షాప్ నిర్వహించి, జిల్లాల ఏర్పాటుకు తుది కసరత్తు జరపునున్నట్టు చెప్పారు. మండలాలూ పునర్వ్యవస్థీకరించాలని, మండల కేంద్రానికి దగ్గరగా ఉన్న గ్రామాలను అదే మండలంలో చేర్చాలని, అర్బన్ మండలాలు కొత్తగా ఏర్పాటు చేయాలని, రెండు నియోజక వర్గాలకు కలిపి ఒక ఆర్డీవో ఉండాలని సూచించారు. రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ జరపాలని, కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. జిల్లాల ఏర్పాటుపై మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయని, వాటికి పరిగణనలోకి తీసుకోవద్దని చెప్పారు. సిఎం ఆధ్వర్యంలోని కమిటీ కొత్త జిల్లాల ఏర్పాటుపై కసరత్తు చేస్తోందని, కలెక్టర్లూ కూలంకశంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. మ్యాపులు రూపొందించి, వర్క్‌షాప్ నిర్వహించిన తర్వాతే కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకునున్నట్టు చెప్పారు. నాయకులు, పార్టీల డిమాండ్ల ప్రకారం కాకుండా ప్రజాసౌలభ్యం మేరకే జిల్లాల ఏర్పాటు ఏర్పాటు కావాలన్నారు. జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి, కొత్త కలెక్టరేట్లు, పోలీసు కార్యాలయాల నిర్మాణానికి వంద కోట్ల చొప్పున కేటాయించనున్నట్టు చెప్పారు. ఈ దసరా నుంచే కొత్త జిల్లాలు మనుగడలోకి రావాలనేది లక్ష్యమని అన్నారు. కొత్త జిల్లాలు, మండలాలు, డివిజన్లు ఏర్పాటు చేస్తున్నందున అదనంగా రెవెన్యూ అధికారులనూ నియమించనున్నట్టు సిఎం చెప్పారు. ఖాళీలతోపాటు కొత్త పోస్టులకు ప్రతిపాదనలు పంపినట్టు చెప్పారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల పునర్వ్యవస్థీకరణలో కలెక్టర్లు శాస్ర్తియంగా ప్రతిపాదనలు పంపించాలని సిఎం కెసిఆర్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.

చిత్రం జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కె చంద్రశేఖర్ రావు.