ఆంధ్రప్రదేశ్‌

ఫార్మా సిటీలో పేలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక (విశాఖ), మే 24: విశాఖపట్నం జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో శ్రీకర్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మంగళవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇస్సాయి రామకృష్ణ (26) మృతి చెందగా, కె శ్రీనివాసరావు, సింహాద్రితోపాటు మహిళా కార్మికురాలు సరోజిని నాయుడు తీవ్రం గా గాయపడ్డారు. వీరిని సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. వీరితో పాటు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న మరో 16 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. శ్రీకర్ లేబరేటరీస్ ప్రైవేట్ కంపెనీలో యుటిలిటీ బ్లాక్‌లో పని చేస్తుండగా అమోనియం నైట్రోజన్ సిలిండర్‌కు చెందిన సేఫ్టీ వాల్వ్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలింది. పేలుడుకు అమోనియా గ్యాస్ లీక్ కావడంతో ఆ బ్లాక్ వద్ద పని చేస్తున్న కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు.

చిత్రం... పేలుడు ధాటికి కూలిన పరిశ్రమ గోడలు