తెలంగాణ

బదిలీలు, పదోన్నతులపై ఆంక్షల ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: ఉద్యోగుల విభజన కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, సీనియార్టీ సమీక్ష, కారుణ్య నియామకాలపై ఇంతకాలం కొనసాగిన నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఉద్యోగుల విభజన ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన కమలానాథన్ కమిటీ కసరత్తు దాదాపు పూర్తి కావడంతో వీటిపై గతంలో విధించిన ఆంక్షలను ఎత్తివేస్తూ సాధారణ పరిపాలనశాఖ మంగళవారం జీవో 1161 విడుదల చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ పేరుతో జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో తొలగించిన ఆంక్షలు స్థానిక, జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టులకు వర్తిస్తుందని పేర్కొన్నారు. శాఖాధిపతులు, సెక్రటేరియట్ స్టేట్ కేడర్, రాష్ట్ర స్థాయి అధికారుల నియామకాలు, బదిలీలు, పదోన్నతులకు కమలానాథ్‌న్ కమిటీ తుది నివేదిక వచ్చేవరకు ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులపై మళ్లీ ఉత్తర్వులు జారీ అయ్యేవరకు ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొన్నారు.