తెలంగాణ

బోగస్ వేట ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణలో బోగస్ విద్యాసంస్థలు అన్నింటినీ ఏరివేసే వరకూ విజిలెన్స్ దాడులు కొనసాగుతాయని సిఎం కె చంద్రశేఖర్ రావు హెచ్చరించారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించే కోర్సులే ఉండాలని, వేలంవెర్రిగా ఒకేరకమైన కోర్సుల్లో చేరడంవల్ల నిరుద్యోగం పెరిగిందని సిఎం అభిప్రాయపడ్డారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ప్రైవేటు విద్యా సంస్థలతో సిఎం కెసిఆర్ మంగళవారం సమావేశమయ్యారు.
విజిలెన్స్ తనిఖీల నేపథ్యంలో విద్యా సంస్థల భవన నిర్మాణం, వౌలిక సదుపాయాల కల్పనవంటి లోటుపాట్లు వెలుగుచూస్తే, వాటిని సవరించుకోవడానికి తగిన అవకావం, గడువు కల్పిస్తామన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను మూసివేయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని, రాష్ట్రంలో అత్యున్నత విద్య అందించే ప్రక్రియలో ప్రైవేటు భాగస్వామ్యం తప్పనిసరి అని సిఎం అన్నారు. విద్యార్థులే లేకుండా నడుపుతున్న కాలేజీలను ఏరివేయడం ఖాయమని, వీటివల్ల రాష్ట్రానికి చెడ్డపేరు వస్తుందన్నారు. విద్యా సంస్థలు శాస్ర్తియ ఆలోచనలతో విద్యార్థులకు ఉపాధి కల్పించే కోర్సులు అందించాలని కోరారు. ఉద్యోగ, ఉపాధి అవకాశం లేకున్నా వేలంవెర్రిగా ఒకే కోర్సులో విద్యార్థులు చేరడం వల్ల నిరుద్యోగ సమస్య తలెత్తుతుందన్నారు. విద్యా సంస్థలకు ఇచ్చే విద్యుత్‌ను కమర్షియల్ నుంచి జనరల్ కేటగిరికి మార్చడం, ఆస్తి పన్ను మినహాయింపు తదితర డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. తెలంగాణలో విద్యా విధానం ఎలా ఉండాలి? ఏ కోర్సులు ఉండాలి? ఇంకా ఏ కాలేజీలు పెట్టుకోవాలి? విద్యార్థులకు ఇంకా ఏం చేయాలి? ప్రైవేటు విద్యా సంస్థలకు ఏంకావాలి? తదితర విషయాలపై విద్యా సంస్థల ప్రతినిధులు కూలంకషంగా చర్చించి ప్రభుత్వానికి సిఫారసు చేయాలని సిఎం ప్రైవేటు విద్యా సంస్థల ప్రతినిధులకు సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలను కలుపుకొని తెలగాణలో మంచి విద్యా విధానం తేవాలన్నది తమ లక్ష్యమని వివరించారు. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్నారు. కోర్సులు, కాలేజీలు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ కావాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ విద్యార్థులు, అధ్యాపకుల రేషనలైజేషన్ కావాలని సిఎం కెసిఆర్ అన్నారు.

చిత్రం.. ఎంసిఆర్‌హెచ్‌ఆర్‌డిలో ప్రయివేట్ విద్యాసంస్థల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సిఎం కెసిఆర్