తెలంగాణ

రూ.139 కోట్లతో ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 24: తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, సురక్షిత చర్యలు తీసుకునేందుకు రాష్ట్రప్రభుత్వం రూ. 139 కోట్లతో ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ సంస్ధను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనలకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ట్రాఫిక్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్నాటక, కేరళలో రోడ్‌సేఫ్టీ విభాగం ఉన్నా, తెలంగాణలో మాదిరిగా ప్రత్యేకంగా ఒక ట్రాఫిక్ ఫోర్స్ విభాగం లేదు. దేశంలో తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఒక ట్రాఫిక్ పోలీసు ఫోర్స్‌ను రోడ్ సేఫ్టీ పరిధిలో ఏర్పాటు చేయనుంది. రాష్ట్రంలో గత ఏడాది రోడ్డు ప్రమాదాల్లో 7100 మంది మృతి చెందారు. ప్రమాదాలను అరికట్టేందుకు రోడ్ సేఫ్టీ సంస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేసేందుకు ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దాదాపు 6300 మంది హైవే ట్రాఫిక్ పోలీసులు రోడ్ సేఫ్టీ పరిధిలో పని చేస్తారు. రోడ్డు రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు వసూలు చేసే కాంపౌండింగ్ ఫీజులో సగం భాగాన్ని రోడ్ సేఫ్టీ నిధికి ఇస్తారు. రాష్ట్రంలోని జాతీయ, రాష్ట్ర రహదారులపై దాదాపు 360 బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించారు. నిరుడు రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు రూ. 105 కోట్లను పెనాల్టీల కింద వసూలు చేస్తారు. ఇకపై ఈ రుసుము రోడ్ సేఫ్టీ సంస్థకు ఇస్తారు. జాతీయ రహదారులపై పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తారు. ప్రమాదం జరిగిన వెంటనే హైవే ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తారు. ఆయా జిల్లాల్లో ఎస్పీల పరిధిలో పని చేసే స్థానిక పోలీసులతో ట్రాఫిక్ రోడ్ సేఫ్టీ పోలీసులు సమన్వయంతో పనిచేస్తారు.

రేపు తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 24: తెలంగాణ ఎమ్సెట్ ఫలితాలను గురువారం విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేయనున్నారు. సచివాలయంలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ఈ ఫలితాలను విడుదల చేస్తారు. 15వ తేదీన తెలంగాణలో కేవలం ఇంజనీరింగ్ స్ట్రీం, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ విభాగాలకు మాత్రమే ఎమ్సెట్‌ను నిర్వహించారు. ఈ పరీక్షలకు ఇంజనీరింగ్ స్ట్రీంలో 1,44,510 మందికి, అగ్రికల్చర్ స్ట్రీంలో 1,02,012 మందికి హాల్‌టిక్కెట్లు జారీ చేశారు. 276 కేంద్రాలు ఇంజనీరింగ్‌కు, 190 పరీక్ష కేంద్రాలను మెడికల్ స్ట్రీంకు అధికారులు ఏర్పాటు చేశారు. కాగా ఫలితాలను వెబ్‌సైట్లలోనూ, పోర్టల్స్, బిఎస్‌ఎన్‌ఎల్ హెల్ప్‌లైన్ సెంటర్‌ల ద్వారా ఫలితాలు వెల్లడికి ఏర్పాట్లు జరిగాయి.