ఆంధ్రప్రదేశ్‌

పాలనా సంస్కరణలే ప్రధాన అజెండా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 24: మూడు నెలల తరువాత రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల సదస్సును బుధ, గురువారాల్లో విజయవాడలో నిర్వహించనుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ళలో ప్రభుత్వం ఏడోసారి కలెక్టర్ల సదస్సును నిర్వహిస్తోంది. స్థానిక అవెన్యూ కళ్యాణ మండపంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగబోతోంది. రెండంకెల అభివృద్ధి, పాలనా సంస్కరణలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి ప్రధాన అజెండాగా ఈ సదస్సు జరగబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రెండెంకెల వృద్ధి రేటుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనిపై కలెక్టర్ల సదస్సులో క్షుణ్ణంగా చర్చించనున్నారు. తొలి రోజు సదస్సును సిసిఎల్‌ఎ అనిల్ చంద్ర పునీత లాంఛన ప్రాయంగా ప్రారంభిస్తారు. ఆ తరువాత ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కెఇ కృష్ణమూర్తి, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభోపన్యాసం చేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ మూడు నెలల్లో ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాలు, వాటి అమలు తీరుతెన్నులను కలెక్టర్లకు వివరిస్తారు. అలాగే ప్రభుత్వ లక్ష్యాలను కూడా తెలియచేయనున్నారు. ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలకోపన్యాసం చేయనున్నారు. ముఖ్యంగా పాలనా సంస్కరణలపై చంద్రబాబు కలెక్టర్లకు వివరించనున్నారు. పెండింగ్ ఫైల్స్, జిల్లాల వారీగా పెర్ఫార్మెన్స్ అసెస్‌మెంట్, ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన పల్స్ సర్వేలపై జిల్లాల వారీగా నివేదికలపై సీఎం సమీక్షించనున్నారు. ఈ సదస్సులో గవర్నెన్స్ లాబ్‌పైన సమీక్ష జరపనున్నారు. అదేవిధంగా సంక్షేమ రంగం, సబ్సిడీ వినియోగంతోపాటు లబ్దిదారుల ఎంపిక, వారికి పథకాలు అందుతున్న తీరుతెన్నులపై సమీక్ష జరపనున్నారు. సంక్షేమ పథకాలను పారదర్శకంగా ప్రజలకు అందించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చిస్తారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నందున సంక్షేమ పథకాలు ప్రజలకు ఏవిధంగా అందుతున్నాయన్న అంశంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. సాంఘిక, గిరిజన, బిసి, కాపు, మైనార్టీ, బ్రాహ్మణ సంక్షేమం, సెర్ప్, చంద్రన్న బీమా, చంద్రన్న ఆరోగ్య పథకంపై చర్చించనున్నారు. చంద్రన్న బీమా పథకంపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి. పర్యాటకం, వౌలిక వసతులు, గృహ నిర్మాణం, పట్టణ వౌలికవసతుల కల్పన, మున్సిపాలిటీల రేటింగ్‌పైన కూడ చర్చ జరగనుంది. స్కిల్ అప్‌గ్రెడేషన్, పాఠశాల విద్య, ఉన్నత విద్యతోపాటు నీరు-ప్రగతిపై జిల్లాల వారీగా సిఎం సమీక్ష జరపనున్నారు. పంట సంజీవిని, ఇంకుడు గుంతలు, నీటి నిర్వహణ అంశాలపై చర్చించనున్నారు. రెండో రోజు సదస్సులో రానున్న కాలంలో ప్రభుత్వం చేపటనున్న వివిధ వినూత్న కార్యక్రమాల గురించి కలెక్టర్లతో సిఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. ఈ సదస్సులో పరిశ్రమలు, వౌలిక సదుపాయాలు, అగ్రి బిజినెస్ తదితర అంశాలపై చర్చించనున్నారు.