ఆంధ్రప్రదేశ్‌

టి ఎంసెట్‌లో మెరిసిన విశాఖ విద్యార్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: ఎపిఎంసెట్-2016లో ర్యాంక్‌లు దక్కించుకున్న విశాఖకు చెందిన విద్యార్థులు టిఎంసెట్‌లోనూ ర్యాంక్‌లు సాధించారు. విశాఖకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎపిఎంసెట్‌లో, టిఎంసెట్‌లో మొదటి పది ర్యాంక్‌ల్లో ఉండటం గమనార్హం. ఎపిఎంసెట్‌లో ఇంజనీరింగ్‌లో మొదటి ర్యాంక్ సాధించిన ఎస్.వంశీకృష్ణారెడ్డి టిఎంసెట్‌లో 10వ ర్యాంక్ సాధించాడు. ఎపిఎంసెట్ మెడికల్‌లో 7వ ర్యాంక్ సాధించిన పెద్దిరెడ్ల శైలజ టిఎంసెట్‌లో 9వ ర్యాంక్ సాధించింది.
మొదటి పది ర్యాంకుల్లో పెద్దిరెడ్ల శైలజ
రెండు రాష్ట్రాల ఎంసెట్‌ల్లోనూ మొదటి పది ర్యాంక్‌ల్లో ఉండటం ఆనందంగా ఉందని పెద్దిరెడ్ల శైలజ చెప్పింది. కష్టానికి ఫలితం దక్కిందని, తల్లితండ్రులు, అధ్యాపకులు ఎంతోగానో ప్రోత్సహించారని పేర్కొంది. రోజుకు దాదాపు 16 గంటలు కష్టపడి చదివినందుకు మంచి ప్రతిఫలం దక్కింది. ఎయిమ్స్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాను. ఎండి న్యూరాలజీ చేయాలని ఉంది. తండ్రి వెంకటరావు విశాఖలోని ఎవిఎన్ కళశాలలో కెమిస్ట్రీ అధ్యాపకునిగా పని చేస్తున్నారు. తల్లి నాగమణి గృహిణి.
వంశీకృష్ణారెడ్డికి పదో ర్యాంక్
ముంబయి ఐఐటిలో కంప్యూటర్ సైన్సు చేయాలని లక్ష్యం. అందుకోసం రోజుకు 14 గంటల పాటు కష్టపడి చదివానని వంశీకృష్ణారెడ్డి తెలిపాడు. తల్లితండ్రులు, అధ్యాపకులు ప్రోత్సాహంతో రెండు రాష్ట్రాల ఎంసెట్‌లో టాపర్‌గా నిలిచాను. ఐఐటి జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష రాశాను. మంచి ర్యాంక్ రావచ్చని భావిస్తున్నానన్నాడు. వంశీ తండ్రి సుధాకర రెడ్డి విశాఖ ఉక్కు కర్మాగారంలో ఎజిఎంగా పని చేస్తున్నారు.