ఆంధ్రప్రదేశ్‌

వసతులు లేకపోతే కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 26: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలల్లో వౌలిక వసతులు పక్కాగా లేకపోతే ఆ కళాశాలలపై కఠిన చర్యలు తప్పవని రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు. గురువారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఉన్న వసతులు, వౌలిక సదుపాయాల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో పొందుపరిచామని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాల యాజమాన్యాలు ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోకుండా ఈ చర్యలు తీసుకున్నామని చెప్పారు. వెబ్‌సైట్‌లో చూపిన విధంగా ఆయా కళాశాలల్లో సదుపాయాలు లేకుంటే, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని గంటా స్పష్టం చేశారు. ఇంజనీరింగ్ కళాశాలలకు గ్రేడింగ్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. కళాశాలల్లో ఎన్‌రోల్‌మెంట్ పక్కాగా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయనున్నామని గంటా చెప్పారు. కొన్ని యాజమాన్యాలు బినామీ పేర్లు ఎన్‌రోల్ చేసి, ఫీజ్ రీఅంబర్స్‌మెంట్ పొందుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, అందుకే బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చామని ఆయన చెప్పారు.
కళాశాలల్లో వసతుల తనిఖీకి అవసరమైతే తానే వెళతానని గంటా చెప్పారు. రాష్ట్రంలో ప్రభుత్వ యూనివర్శిటీల్లో విద్యా ప్రమాణాల్లో నాణ్యత తగ్గిందన్న ఆరోపణలు వస్తున్నాయని విలేఖరులు ప్రశ్నించగా, దీనికి గంటా సమాధానం చెపుతూ రాష్ట్రంలోని యూనివర్శిటీలకు నిధులు పుష్కలంగా కేటాయించామని, కావల్సిన ఫ్యాకల్టీని కూడా నియమించామని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచేందుకు నిరంతర చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలియచేశారు. రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైందని గంటా తెలియచేశారు.