రాష్ట్రీయం

ఆర్సీఐ క్యాష్ మేనేజ్‌మెంట్ కుంభకోణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 26: నగరంలోని ఏటిఎంలకు డబ్బులు సరఫరా చేసే సంస్థలో జరిగిన కుంభకోణంలో సిసిఎస్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. మరో ఎనిమిది కోట్ల మేరకు నిందితులు కొల్లగొట్టారు. నాలుగు రోజుల క్రితం ఏటిఎంలకు డబ్బులు సరఫరా చేసే ఫైనాన్స్ సెక్యూరిటీ సంస్థలో రూ. 9.98 కోట్లు అపహరించబడ్డాయని సంస్థ అధికారి తుకారం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఖాతాదారుల సొమ్ము అప్పనంగా నొక్కేసిన డబ్బంతా ఐపిఎల్ మ్యాచ్‌లకు, అమ్మాయిలతో జల్సాలకు ఖర్చు చేసినట్టు పోలీసులు లాగిన కూపీతో డొంకంతా కదిలింది. ఏటిఎంల్లో జమ చేయాల్సిన సొమ్మును సంస్థ సభ్యులే కాజేయడం కలకలం రేపుతోంది. నగరంలోని 52 ఏటిఎం కేంద్రాల్లో జమ చేయాల్సిన సొమ్ము గల్లంతైనట్టు ఆడిటింగ్‌లో బయటపడింది. క్యాష్ కస్డోడియన్లుగా పనిచేస్తున్న అనంతపురానికి చెందిన లోకేశ్వర్ రెడ్డి, ప్రవీణ్ కాజేసినట్టు సంస్థ మేనేజర్ నాగరాజు తుకారం గేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
ఎఫ్‌ఎస్‌ఎస్ సంస్థ, ఆర్‌సిఐ సంస్థకు ఇచ్చిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ మాయమైన డబ్బుపై ఆరా తీస్తున్నారు. అయితే ఈ కేసును తుకారం గేట్ పోలీసులు సిసిఎస్ పోలీసులకు అప్పగించారు. దీంతో కూపీ లాగుతున్న సిసిఎస్ పోలీసులు ఓ నిందితుని వద్ద నుంచి రూ. కోటి స్వాధీనం చేసుకున్నారు. పరారీలోఉన్న నిందితులు దొరికారు. నిందితులను శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్ట సిసిఎస్ పోలీసులు తెలిపారు.