రాష్ట్రీయం

ఆగస్టులోగా చేర్చాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: కాపునేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శనివారం ఇక్కడ కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత, మెగాస్టార్ చిరంజీవి, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణరావుతో పాటు ఏపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డిని కలిసి కాపులను బిసిల్లో చేర్చేందుకు తాను చేపట్టిన ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని కోరారు. రఘువీరారెడ్డిని కలిసిన తర్వాత ముద్రగడ మాట్లాడుతూ వచ్చే ఆగస్టులోగా కాపుకులస్తులను బిసిలలో చేర్చే విధంగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో మరోసారి భారీ ఎత్తున ఉద్యమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఆగస్టు నెలలోగా చంద్రబాబు ప్రభుత్వం తమ డిమాండ్‌కు చట్టబద్ధతను కల్పించాలన్నారు. రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో ఈ అంశాన్ని చేర్చే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. కాపుసామాజిక వర్గం ఇప్పటికే రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, సామాజికంగా తీవ్రంగా నష్టపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కాపుకులస్తులు వీధినపడే పరిస్థితిని చంద్రబాబు కల్పించారన్నారు. గతంలో తాము ఉద్యమం చేపట్టినప్పుడు జస్టిస్ మంజునాథ్ కమిటీ ద్వారా నివేదికను 9 నెలల్లో తెప్పించుకుని కాపులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఇచ్చిన హామీని ఆగస్టు లోగా నిలబెట్టుకోవాలన్నారు. అసెంబ్లీలో ఈ నివేదికను ప్రవేశపెట్టి ఆమోదించాలని, ఒక తీర్మానం చేయాలని ఆయన కోరారు. తాను మరో రెండు, మూడు రోజులు హైదరాబాద్‌లో ఉంటానని ముద్రగడ చెప్పారు. కాపుల ఉద్యమానికి మద్దతు ఇస్తున్న ప్రతి నేతను కలుస్తానని ఆయన చెప్పారు. బిసిలకు అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేయాలన్నారు. కాగా, కాపులను బిసిల్లో కలపాలనే డిమాండ్‌కు తమ పార్టీ మద్దతు ఉంటుందని ఏపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి తెలిపారు. ముద్రగడ పద్మనాభం శనివారం సాయంత్రం కాంగ్రెస్ మాజీ ఎంపి, తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంతరావును కూడా కలిశారు.

చిత్రం హైదరాబాద్‌లో శనివారం చిరంజీవిని కలిసిన ముద్రగడ