రాష్ట్రీయం

రోగిని మురుగుకాల్వలో పడేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 28: ధర్మాసుపత్రి కాస్తా అధర్మాసుపత్రి అయింది... మానవత్వం మురుగుకాల్వలో మంటగలిసిపోయింది... వైద్యం కోసం సర్కారీ ఆసుపత్రికి వచ్చిన ఓ రోగికి ఎదురైన అనుభవం తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. ఆసుపత్రి సిబ్బంది అతన్ని బెదిరించిన తీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ప్రాణం విలువ తెలియని వైద్య సిబ్బంది ఓ రోగిని నిర్ధాక్షిణ్యంగా మురుగుకాల్వపాలు చేసేశారు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది. మూడు రోజుల పాటు మురుగుకాల్వలో చావుబతుకుల మధ్య పడివున్న ఆ రోగిని స్థానికులు గుర్తించి ఆసుపత్రికి చేర్చడంతో ప్రస్తుతం అతను కోలుకుంటున్నాడు. ఎలుకలు కొరికేయడంతో అతని చేయి తెగిపోయింది. మురికి కాల్వలో రెండు రోజులుగా నానటంతో దేహం కుచించుకుపోయింది. స్థానికులు చొరవ తీసుకోవడంతో పేరు కూడా చెప్పలేని స్థితిలో ఉన్న అతనికి ప్రస్తుతం వైద్యం చేస్తున్నారు. కాగా, వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన తనను మూడురోజుల క్రితం అక్కడి సిబ్బంది సమీంలోని కాల్వలో పడేశారని. ఎవరికైనా నిజం చెబితే చంపేస్తామని బెదిరించారని శక్తి కూడదీసుకుని మరీచెప్తున్నాడు. బాధితుడి చేతికి సిలైన్, ఇంజక్షన్లు ఇచ్చేందుకు అమర్చిన క్యాన్ ఉంది. పేరు, వివరాలు చెప్పలేకపోతున్న ఆ వ్యక్తి ఎవరనేది ఇంకా తెలియడం లేదు. నెల్లూరు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఈ విషాదం ఇప్పుడు పెద్ద సంచలమైంది. స్థానిక పెద్దాసుపత్రిలో చికిత్సకోసం మూడురోజుల క్రితం అతడు చేరాడని తెలుస్తోంది. మొదట చికిత్స చేసిన వైద్య సిబ్బంది, తరువాత కొద్దిదూరంలోని కాల్వలో పడేశారు. వైద్య సిబ్బంది ఎందుకు అలా చేశారన్న విషయం సైతం అంతుచిక్కడం లేదు. రెండు రోజులుగా ఎలాంటి ఆహారం అందకపోవడం, మురికి నీటినే తాగాల్సి రావడంతో అతని దేహం కుంగికృశించిపోయింది. మొదట కాల్వలో ఏదో శవం ఉందనే అనుకున్నారు స్థానికులు. దగ్గరగా వెళ్లిచూసినపుడు కొద్దిగా కదులుతుండటంతో, కొందరు యువకులు, మహిళలు ధైర్యం చేసి అతన్ని బయటకు తీశారు. కొన ఊపిరితోవున్న అతనికి సపర్యలు చేశారు. స్థానికుల సహాయక చర్యలతో కొద్దిగా శక్తి కూడదీసుకున్న రోగి, భయంకరమైన నిజాలను వెళ్ళగక్కాడు. ఇది తెలిసి ఆగ్రహంతో స్థానికులంతా ఆస్పత్రికి వెళ్లి సిబ్బందిని నిలదీశారు. వైద్యంకోసం అతడు చేరినమాట వాస్తవమేనని, అయితే అతడిని తామెవరూ బయటపడేయలేదని, తనంతటతానే వెళ్లిపోయాడని ఆస్పత్రి సిబ్బంది వాదనకు దిగారు. కదలలేని స్థితిలో ఉన్న అతడు బయటకు ఎలా వెళ్తాడని స్థానికులు గట్టిగా నిలదీయటంతో సిబ్బంది నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కాళ్లు, చేతుల్ని ఎలుకలు కొరికేశాయి. దీంతో కుడిచేయి తెగి దేహానికే వేళ్లాడుతోంది. ఎడమచేతిపై సెలైన్ పెట్టేందుకు నీడిల్ పెట్టి ఉంది. అతడు ఇంకేమీ చెప్పలేని స్థితిలో ఉండటంతో పూర్తి వివరాలు తెలియలేదు. స్థానికులు చొరవ తీసుకుని అదే ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయిస్తున్నారు.

చిత్రం మురికి కాలువలో నుంచి బయటకు తీసిన తర్వాత కొనప్రాణాలతో ఉన్న రోగి