రాష్ట్రీయం

అద్భుతంగా అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: నవ్యాంధ్రప్రదేశ్‌కు అద్భుతమైన రాజధాని అమరావతి నిర్మించడం ఒక అదృష్టంగా భావిస్తున్నానని, చాల కష్టతరమైనప్పటికీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా దేశంలోనే ఒక గొప్ప రాజధానిగా అమరావతిని నిర్మిస్తామని, ఇండియా అంటే అమరావతి గుర్తుకువచ్చేలా రూపొందిస్తామని సి ఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో గ్రౌండ్‌లో జరుగుతున్న మహానాడు సభలో సిఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర రాజధాని నిర్మాణంపై మహానాడులో ప్రవేశపెట్టిన తీర్మానం అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణం గురించి సవివరంగా తెలియజేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి రాజధానిని నిర్మించే అవకాశం రావడం ఒక అదృష్టమన్నారు. రాష్ట్ర విభజన తరువాత రాజధాని నిర్మాణం కోసం మన మధ్య వివాదాలను లేపడానికి అప్పటి కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసిందన్నారు. దీంతో ఎవరికి వారు తమ ప్రాంతంలో రాజధానిని నిర్మించాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో తాను స్వార్థంతో ఆలోచించి ఉంటే తన ఇంటి పరిసరాల్లో ఉన్న కల్యాణి డ్యాం వద్ద 10వేల ఎకరాల భూమి ఉందని, అక్కడే రాజధానిని నిర్మించే యోచన చేసి ఉండేవాడినన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, మండలాలు సమానంగా అభివృద్ధి చెందాలని, సమన్యాయం జరగాలన్న సంకల్పంతోనే గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మాణానికి సిద్ధమయ్యానని అన్నారు. తనకున్న పరిచయంతో కేవలం ఆరునెలల్లో మాస్లర్ ప్లాన్ ఇవ్వడానికి సింగపూర్ ముందుకు వచ్చిందని అన్నారు. హైదరాబాదులో 165 కిలోమీటర్లు మేర రింగ్‌రోడ్డు ఏర్పాటుకు ప్రతిపాదన చేసినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విమర్శించారని అన్నారు. అయితే సైబరాబాదు భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందో చూడాలని తాను చెప్పినట్లుగానే ఇప్పుడు జరిగిందని అన్నారు. అమరావతిలో 220 కిలోమీటర్లు మేర రింగురోడ్డును ఏర్పాటు చేస్తామన్నారు. అమరావతి పేరులోనే పవరుందని, అందుకే ఈ పేరును ఎవరూ వ్యతిరేకించలేదని అన్నారు. అభివృద్ధి చేస్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్ష నేత అన్నివిధాలా అసత్య ప్రచారాలతో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. రైతులు రాజధానికి భూముల ఇస్తానంటే ఇవ్వకుండా అడ్డుపడ్డారన్నారు. కోర్టులకు, ట్రిబ్యునళ్లకు వెళ్లేవారికి ఆర్థిక సాయం చేస్తూ దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అమరావతి నుంచి అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలకు ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్మించడానికి తాను ప్రయత్నిస్తుంటే జగన్‌మోహన్ రెడ్డి అడ్డుపడడం దారుణమన్నారు. చివరికి పులివెందులకు రోడ్లు వేస్తామన్నా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న జగన్ తీరు చూస్తుంటే ప్రతిపక్ష నేత అని చెప్పడానికే సిగ్గుగా ఉందన్నారు. జూన్‌లోగా హైదరాబాదులోని ఉద్యోగులు అమరావతికి రావాల్సిందేనని సి ఎం స్పష్టం చేశారు.

చిత్రం మహానాడులో శనివారం పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న చంద్రబాబు నాయుడు