రాష్ట్రీయం

సంస్కారాన్ని పెంపొందించేది సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: సంస్కారాన్ని పెంపొందించేది సాహిత్యం అని బిహార్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎల్.నరసింహారెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా శనివారం రవీంద్ర భారతిలో ఉర్దూ రచయిత్రి జిలానీ బానోకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏడాది సాహిత్య రంగంలోని ప్రముఖులకు ఈ అవార్డును అందజేస్తూ సన్మానించడం గొప్ప విషయమని అన్నారు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ జీవిత చరమాంకం అంత గొప్పగా జరగలేదని ఆయన అన్నారు. ఎన్టీఆర్ జయంతి రోజున టీవీల్లో ఆయన పాటలు, డైలాగులు వేస్తున్నారని, అయితే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని లక్ష్మీపార్వతి నిర్వహించడం గొప్ప విషయమన్నారు. ఇలా ఉండగా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ఆలోచన ఎన్టీఆర్ కుమారులకు, కుమార్తెలకు కలగలేదా? వారి పిల్లలకు తట్టలేదా? అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ వారికి అంత గొప్పగా కనిపించలేదా? అని అన్నారు. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి ఎప్పటికీ మరచిపోదని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్టు చైర్‌పర్సన్ డాక్టర్ లక్ష్మీపార్వతి మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశీస్సులతో, సినారె, కెవి రమణాచారి వంటి వారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి రమణాచారి ప్రసంగిస్తూ ఎన్టీఆర్ కారణ జన్ముడని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో సన్మాన గ్రహీత జిలానీ బానో, సినీ నటుడు కోట శ్రీనివాసరావు, చారిత్రక పరిశోధకులు కె.జితేంద్రబాబు, జ్యూరీ సభ్యులు ప్రొఫెసర్ ఖలీద్ ఖాద్రీ, రచయిత్రి వోల్గా ప్రసంగించారు.

చిత్రం రవీంద్రభారతిలో ఉర్దూ రచయత్రి జిలానీ బానోకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందజేసి సన్మానిస్తున్న జస్టిస్ నరసింహారెడ్డి, సినారె, లక్ష్మీపార్వతి, కోట శ్రీనివాసరావు, కె.వి.రమణాచారి