రాష్ట్రీయం

కృష్ణులు ఇద్దరు..దారులు వేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: మహానాడు నందమూరి వారసుల మధ్య విభేదాలకు వేదికగా మారింది. ప్రత్యేకహోదా, మహానాడుపై ఎన్టీఆర్ పుత్రరత్నాల పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు పార్టీ వర్గాలలో చర్చనీయాంశమయ్యాయి. మహానాడు... కార్యకర్తల పండుగ. కుటుంబ వాతావరణంలో, ఇది తమ పార్టీ అని భావించి నిర్వహించుకునే సంబరం. కానీ అలాంటి సంబరానికి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, మాజీ ఎంపి నందమూరి హరికృష్ణ ముఖం చాటేస్తే, మరో తనయుడైన ఎమ్మెల్యే బాలకృష్ణ మాత్రం తిరుపతి మహానాడు వేదికపై చలాకీగా తిరుగుతూ కనిపించారు. గత కొద్దికాలం నుంచి బాబు మీద అలక, ఆగ్రహంతోఉన్న హరికృష్ణ తన తండ్రి జయంతి సందర్భంగా నిర్వహించే మహానాడుకు రాకుండా, హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌కు వెళ్లి నివాళి అర్పించడం చర్చనీయాంశమయింది. తనకు ఎన్టీఆర్ జయంతి కంటే మరో ముఖ్యమైన కార్యక్రమం ఏదీ లేదని, అందుకే మహానాడుకు వెళ్లలేదని హరికృష్ణ హైదరాబాద్‌లో మీడియాలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రత్యేక హోదాపై తెలుగుదేశం నాయకత్వాన్ని ఇరుకున పెట్టేలా మాట్లాడారు. ‘ప్రత్యేక హోదా ఇస్తామన్న వాళ్లు మోసం చేశారు. తెస్తామన్న వాళ్లు ఏం చేశార’ని నిలదీశారు.
హోదా ఇస్తామన్న బిజెపి మోసం చేస్తే, తెస్తామన్న బాబు ఏం చేస్తున్నారు? ఎందుకు వౌనంగా ఉన్నారని హరికృష్ణ అడగకుండానే నిలదీసినంత పనిచేశారు. దానితోపాటు, ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికొకరు బయటకొచ్చి పోరాటం చేయాలని, ప్రత్యేక హోదానే ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అని హరికృష్ణ చేసిన ప్రకటన టిడిపి నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. ఇది ఒకరకంగా హోదా కోసం పోరాడుతూ తమ పార్టీ వైఫల్యాన్ని ఎండగడుతున్న విపక్షాలకు ఊతమివ్వడంగానే టిడిపి నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో బిజెపితో ఘర్షణ పడకుండా, లౌక్యంగా బండి లాగిస్తున్న టిడిపి వైఫల్యాన్ని హరికృష్ణ ప్రశ్నించినట్లుగానే స్పష్టమవుతుంది.
‘రేపటి నుంచి కాంగ్రెస్, వైసీపీ నేతలు.. మీ బావమరిది, పార్టీ నేతే హోదా అంశంపై మీరేం చేయడం లేదని అంటున్నారు. మిమ్మల్ని మీ బావమరిదే నమ్మడం లేదన్న ప్రచారం ప్రారంభిస్తే పార్టీ మరిన్ని చిక్కుల్లో పడటం ఖాయమ’ని పార్టీ నేతలు విశే్లషిస్తున్నారు. అయితే, తన సోదరుడు హరికృష్ణ హైదరాబాద్‌లో ప్రత్యేక హోదాపై సమరనినాదం చేస్తే, బాలకృష్ణ మాత్రం సాత్వికంగా మాట్లాడారు. అన్న జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన బాలయ్య.. ప్రత్యేక హోదాపై సంయమనం పాటించాలని, తాము బిజెపితో మాట్లాడుతున్నామని సర్దిచెప్పే ధోరణిలో మాట్లాడటం చర్చనీయాంశమయింది. ఒకరకంగా బాలకృష్ణ పార్టీ అధినేత బాబు మార్గంలో పయనిస్తుంటే, హరికృష్ణ మాత్రం సొంత దారిలో వెళుతున్నట్లు కనిపిస్తోంది. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో హరికృష్ణ వ్యాఖ్యలకుప్రాధాన్యం ఏర్పడింది. సమైక్యవాదానికి మద్దతుగా తన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేసి, దానిని పట్టుపట్టి మరీ ఆమోదించుకున్న హరికృష్ణ వైఖరిని బాబు అప్పట్లోనే తప్పుపట్టారన్న ప్రచారం జరిగింది. అప్పుడు రాష్ట్రం కోసం పదవీత్యాగం చేసినందున, ఇప్పుడు ఎన్టీఆర్ కుటుంబకోటాలో తనకు మళ్లీ రాజ్యసభ సీటుఇవ్వాలని..హరికృష్ణ గత కొద్దికాలం నుంచి కోరుతున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

చిత్రం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న హరికృష్ణ. కుటుంబ సభ్యులు