రాష్ట్రీయం

ఎన్టీఆర్ తెలుగుబిడ్డ కావడం గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 28: దివంగత ఎన్ టి ఆర్ తెలుగు జాతిలో పుట్టడం గర్వకారణమని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో నెహ్రూమున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్‌లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండోరోజు సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కర్రపెత్తనంతో విచ్చలవిడిగా వ్యవరిస్తున్న కాంగ్రెస్ దురహంకారానికి అడ్డుకట్ట వేయడానికే ఎన్ టి ఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టారన్నారు. ఆయన ప్రాణపదంగా భావించే సినీరంగాన్ని కూడా వదులుకుని రాజకీయరంగ ప్రవేశం చేశారన్నారు. తొడగొట్టి గడపదాటి కాలుదువ్వి చరిత్ర సృష్టించిందని అన్నారు. తాము తమిళవారు కాదు తెలుగువారమని చెప్పిన ఘనత ఎన్ టి ఆర్ దే అన్నారు. గౌతమీపుత్ర శాతకర్ణి, శ్రీకృష్ణదేవరాయల్లా ఎన్ టి ఆర్ తెలుగువారి గుండెల్లో నిలిచిపోయారని ఆయన తెలిపారు. బడుగు,బలహీన వర్గాలకు, మైనార్టీలకు రాజ్యాధికారాన్ని అందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని అన్నారు. ముఖ్యమంత్రిగా ఆనాడే ప్రజలకు ఆహారభద్రతను కల్పించిన మహానేత ఎన్ టి ఆర్ అని కొనియాడారు. పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలని, కార్యకర్తలు పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత ఉందన్నారు. కార్యకర్తలు లేకుంటే పార్టీలే ఉండవని చెప్పారు.

చిత్రం తిరుపతిలో టిడిపి నిర్వహించిన మహానాడు వేదికపై ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే బాలకృష్ణ