రాష్ట్రీయం

టూరిస్టు ప్రధాని మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 28: రెండేళ్ళలో ప్రధాని నరేంద్ర మోదీ టూరిస్టు ప్రధానిగా మారారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే విమర్శించారు. దేశమంతా కరవు విలయతాండవం చేస్తుంటే బిజెపి నాయకులు, కార్యకర్తలు రెండేళ్ళ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని అన్నారు. బిజెపి చేపట్టిన వికాస్ పర్వ్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ వినాశ్ పర్వ్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఎఐసిసి ముఖ్య నాయకులు దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఈ మేరకు శనివారం మల్లిఖార్జున ఖర్గే హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు చేరుకుని పార్టీ ముఖ్యులతో సమావేశమై చర్చలు జరిపారు.
అనంతరం ఖర్గే మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మోదీ ప్రధాని అయిన తర్వాత పాలనపై దృష్టి సారించలేదని, ప్రపంచాన్ని చుట్టి రావాలన్న కోరిక కనిపిస్తున్నదని ఆయన విమర్శించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే సంవత్సరానికి కోటి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ఆయన మండిపడ్డారు. రెండేళ్ళలో రెండు కోట్ల ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో ఆహార ఉత్పత్తులు తగ్గుతున్నా, ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. కరవు నివారణ చర్యలు చేపట్టడంలో కేంద్రం విఫలమైందని ఆయన దుయ్యబట్టారు. మరోవైపు రాష్ట్రాలను ఆదుకోవాలన్న ఆలోచనే కేంద్రానికి లేదని ఖర్గే విమర్శించారు. రాష్ట్రాలకు వాటాను 65 శాతం పెంచామని చెబుతూనే, రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలకు గండి కొడుతున్నారని అన్నారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చారని, లోగడ కాంగ్రెస్ నేతృత్వంలోని యుపిఎ చేపట్టిన పథకాలన్నింటినీ పేర్లు మార్చడమో, నీరుగార్చడమో చేశారని ఆయన విమర్శించారు.
60 ఏళ్ళలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేసిందో ప్రజలకు తెలుసునని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మోదీ రెండేళ్ళలో చేసింది ఏమీ లేదని, ప్రపంచాన్ని చూసి రావాలన్న తపన తప్ప అని ఖర్గే విమర్శించారు. ఇలాఉండగా గాంధీ భవన్‌కు వచ్చిన ఖర్గేకు సిఎల్‌పి నేత కె.జానారెడ్డి, టి.పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, విహెచ్ ఇతర నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.

చిత్రం హైదరాబాద్ గాంధీ భవన్‌లో శనివారం మీడియాతో మాట్లాడుతున్నలోక్‌సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే. చిత్రంలో జానారెడ్డి, షబ్బీర్ అలీ, గీతారెడ్డి