ఆంధ్రప్రదేశ్‌

29 గంటలు..28 తీర్మానాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: శ్రీ వేంకటేశ్వరుని పాదాల చెంత మూడు రోజులపాటు జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడు విజయవంతం అయ్యిందని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు.
ఆదివారం తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ క్రీడామైదానంలో జరిగిన మహానాడు సభలో ఆయన ముగింపు ఉపన్యాసం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతిలోనే టిడిపి తొలి మహానాడు, ఇప్పుడు 35వ మహానాడు జరుగుతుండటం ఆనందంగా ఉందన్నారు. తొలి మహానాడు సమైక్యాంధ్రప్రదేశ్‌లో జరిగితే 35వ మహానాడు నాటికి టిడిపి జాతీయపార్టీగా ఆవిర్భవించిందని, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండటం ఆనందంగా ఉందని చెప్పారు. మహానాడు ప్రారంభమైన తొలి రోజున 10 గంటలు, రెండోరోజు 11 గంటల 30 నిమిషాలు, మూడవ రోజున సాయంత్రం 4.30 గంటలకు 7 గంటల 30 నిమిషాలపాటు నాయకులు, కార్యకర్తలు చర్చల్లో కిందిస్థాయి నాయకులు నుంచి అందరూ పాల్గొన్నారని అన్నారు.
ఈ మహాసభల్లో జరిగిన చర్చల్లో 146 మంది భాగస్వాములు అయ్యారని, వెయ్యిమంది ఆర్గనైజర్లు, వాలంటీర్లు సమష్టిగా పనిచేశారని వారందరిని అభినందించారు.
గతంలో 43వేల చదరపు అడుగుల్లో మహాసభ జరిగితే, తిరుపతిలో కేవలం 19వేల చదరపు అడుగుల్లోనే మహాసభను ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ముందుచూపుతో ఏర్పాటు చేసిన జిల్లా నాయకులను సిఎం ప్రత్యేకంగా అభినందించారు. అలాగే మహానాడుకు వచ్చిన ప్రతిఒక్కరికి మంచి భోజనాలు వడ్డించి పెట్టిన ఫుడ్‌కమిటీని సిఎం ప్రశంసించారు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహానాయకుడు ఎన్‌టిఆర్ ఏర్పాటు చేసిన పార్టీ టిడిపి అని, అందుకే టిడిపి నిర్వహించుకుంటున్న మహానాడు పార్టీకే కాకుండా ప్రజలకు కూడా పండుగే అన్నారు. ఈ మహాసభల్లో మొత్తం 11కోట్ల 55లక్షల 8వేల 558 రూపాయలు విరాళంగా వచ్చిందని చెప్పారు.
ఇందులో చిత్తూరు జిల్లా నుంచి అత్యధికంగా టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి రూ.25 లక్షలు, మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రూ.10 లక్షలు, డాక్టర్ సుధారాణి రూ.5 లక్షలు విరాళంగా అందించారని ప్రకటించారు. కాగా నెల్లూరు జిల్లా నుంచి కోటి 70 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చినట్లు సిఎం తెలియజేశారు. అలాగే ఇతర పార్టీలు ప్రజల రక్తాన్ని పీల్చేస్తుంటే, టిడిపి కార్యకర్తలు మాత్రం తమ రక్తాన్ని ఇస్తున్నారని, మహానాడులో 854 మంది కార్యకర్తలు రక్తదానం చేయడమే ఇందుకు నిదర్శనమని చంద్రబాబు అన్నారు.

ఆరోపణలు నిరూపిస్తే జైలుకెళ్తా
ఆరోపణలు నిరూపిస్తే జైలుకెళ్తా
ఆరోపణలు నిరూపిస్తే జైలుకెళ్తా

ౄ తాతల కీర్తికి మచ్చ రానివ్వను ౄ టిడిపి పుట్టింది తెలంగాణలోనే
ౄ వైకాపా, తెరాస కుట్రలను తిప్పికొట్టండి : నారా లోకేష్ పిలుపు

తిరుపతి, మే 29: రాష్ట్రంలో జరుగుతున్న ఇరిగేషన్, రాజధాని భూముల్లో, రోడ్లు నిర్మాణంలో చివరకు మజ్జిగలో కూడా తనకు వాటాలున్నాయని గత 7 నెలలుగా వైకాపా దొంగ అబ్బాయి చేస్తున్న ఆరోపణల్లో ఒక్కదానిని నిరూపించినా తానే స్వచ్ఛందంగా జైలుకి వెళ్లి కూర్చుంటానని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, సిఎం తనయుడు నారా లోకేష్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోన్‌రెడ్డికి సవాల్ విసిరారు. తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మూడవ రోజైన ఆదివారం జరిగిన మహానాడులో ప్రతిపక్ష అభివృద్ధి నిరోధక చర్యలు-కుట్రలు- దుష్ప్రచారాలపై నారా లోకేష్ సభలో తీర్మానం ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఓవైపు వైకాపా నేత జగన్‌పైన, అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీపైనా, తెలంగాణ సిఎం కెసిఆర్ పైనా తీవ్ర విమర్శలు చేస్తూనే కార్యకర్తలకు భవిష్యత్తులో ప్రతిపక్షాలకు దీటుగా సమాధానం చెప్పే విధానాన్ని బోధ చేశారు. మహానాడు వేదికగా లోకేష్ ప్రసంగిస్తున్న తీరును అధ్యక్ష స్థానంలో ఉన్న చంద్రబాబు నిశితంగా గమనించడం కనిపించింది. ఇప్పటి వరకు తనపై ఒక్క ఆరోపణ రాలేదన్నారు. తన తాత, తండ్రిలా, అంత మంచి పేరు తెచ్చుకోకపోయినా, జగన్‌లా తాను తన తండ్రికి చెడ్డపేరు తీసుకువచ్చే ఏ పనినీ చేయబోనని స్పష్టం చేశారు. 40 కేసులు నెత్తిపై మోస్తూ, 16 నెలలు జైల్లో ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి టిడిపికి నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్భ్రావృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషిని వివరిస్తూ, టిఆర్‌ఎస్, వైకాపాలు చేస్తున్న కుట్రలను కార్యకర్తలకు వివరిస్తూ వీటిని కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌పార్టీ హేతుబద్ధత లేకుండా అడ్డగోలుగా విభజించిందన్నారు. ఈ పర్యవసానంతో ఎక్కడా కూర్చోవాలో కూడా తెలియని పరిస్థితి అన్నారు. ఇక విభజన తరువాత రాజధాని కూడా లేకుండా, 16వేల లోటు బడ్జెట్‌తో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుర్భర పరిస్థితి ఉన్న పరిస్థితుల్లో ఒకే ఒక్క పిలుపుతో రైతులు రాజధాని నిర్మాణానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలను అందించారని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం 67 సంవత్సరాలు వయస్సున్న సిఎం చంద్రబాబు నాయుడు తపిస్తూ అమరావతికి వెళ్లి అక్కడే బస్సులోనే నిద్ర, స్నానం, భోజనం చేసి పట్టుదలతో ముందుకు వెళుతున్నారన్నారు. ఈక్రమంలో తన కుటుంబానికి సైతం దూరంగా ఉన్న మహానేత చంద్రబాబు అని కొనియాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సిఎం నెరవేర్చలేదని పదేపదే తన దొంగ పత్రిక, ఛానెల్‌లో అసత్యప్రచారం చేస్తున్న జగన్ వాస్తవాలను దాచిపెడుతున్నారని అన్నారు. రైతులకు రూ.25 వేల కోట్ల రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.10 వేల కోట్లతో చేయూతనిచ్చిన విషయం జగన్‌కు తెలియదా అని అని ప్రశ్నించారు.
శ్రీసిటీలో పలు పరిశ్రమల స్థాపనతో 7,500 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. రేణిగుంట వద్ద నాలుగు సెల్‌ఫోన్ కంపెనీలు ఏర్పాటయ్యాయని చెప్పారు. రానున్న రెండేళ్ళలో 25వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని లోకేష్ చెప్పారు. ఎన్నికలైన తరువాత జగన్ అనంతపురంలో చేపట్టిన రైతు భరోసా యాత్రకు స్పందన కరవైందన్నారు. పట్టిసీమ ద్వారా ఒక్క చుక్క నీరు రాదని రాయలసీమ ప్రజలకు చెబుతూ, గోదావరి జిల్లాలకు వెళ్లి ఇక్కడకు రావాల్సిన నీరు రాయలసీమకు తరలించేస్తున్నారని చెబుతూ ఉసరవెల్లిలా మాట్లాడిన నేత జగన్ అని విమర్శించారు. కుల,మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని ఇందుకు కాపుల ఉద్యమ నేపథ్యంలో జరిగిన తుని సంఘటనే నిదర్శనమని ఆయన ఆరోపించారు. కాపులు చేస్తున్న ఆందోళనకు కాపుల ముసుగులో తమపార్టీ నాయకులను పంపి విధ్వంసం సృష్టించారని, దీనిపై కొనసాగుతున్న విచారణ ముగిసిన తరువాత ఆపార్టీ నాయకులు జైలుకు వెళ్లడం తధ్యమని లోకేష్ స్పష్టం చేశారు. 138 సంవత్సరాలున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన తరువాత అడ్రస్ లేకుండా పోయిందన్నారు. విభజన చట్టంలోని హామీలను పూర్తిగా నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆంధ్రా పార్టీ అంటూ తెలంగాణ నేతలు చెప్పడం హాస్యాస్పదం అన్నారు. 1982 మే 29న హైదరాబాదులోని పాత శాససభ్యుల భవన సముదాయంలో ఎన్‌టిఆర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి తెరతీసిన విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తు పెట్టుకోవాలన్నారు. ఇక ప్రస్తుతంలో టిఆర్‌ఎస్‌లో ఉన్న కెసిఆర్ నుంచి అనేకమంది మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్యేలు టిడిపిలో ఉండి వెళ్లినవారేనని గుర్తు చేశారు. తెలంగాణలో టిడిపి నేతలను, ఎమ్మెల్యేలను లాక్కొంటూ ఉన్నవారిని ఇబ్బందులకు గురిచేస్తున్న తీరు దారుణమని ఆయన అన్నారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణా తరగతుల్లో విధిగా శిక్షణ పొందాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.