తెలంగాణ

టిఆర్‌ఎస్ నుంచి దరఖాస్తు రాలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 29: వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే విషయంలో టిఆర్‌ఎస్ నుంచి తమకు దరఖాస్తు రాలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ రెండేళ్ల పాలనపై దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ పేరిట ప్రచారాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అమిత్ షా ఆదివారం హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా అమిత్‌షా మీడియాతో కొంత సేపు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పథకాల గురించి వివరించారు. ప్రతి ఏడాదీ ఇలాగే ప్రజల వద్దకు ప్రోగ్రెస్ రిపోర్టులతో వెళతామని ఆయన చెప్పారు. తెలంగాణలో టిడిపితో మిత్రపక్షంగా కొనసాగుతున్నారా? అని ప్రశ్నించగా, ఆంధ్రప్రదేశ్‌లో టిడిపితో కలిసి ఉన్నామని, ఆ రాష్ట్ర మంత్రివర్గంలోనూ తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారంటూ సమాధానాన్ని దాట వేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేయనున్నారా? ఎన్డీఏకు ఆ పార్టీ చేరువ కానున్నదా? అని ప్రశ్నించగా, ఆ పార్టీ నుంచి తమకు ఎటువంటి దరఖాస్తు రాలేదంటూ ఆయన ముక్తసరిగా సమాధానమిచ్చారు. దేశ ప్రజల ఆదరాభిమానాలు తమకు ఉన్నాయని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా 200 ప్రాంతాల్లో, కేంద్రాల్లో వికాస్ పర్వ్‌లు చేపట్టనున్నట్లు చెప్పారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పక్షవాతం పాలసీలు చేపట్టిందని ఆయన విమర్శించారు. యుపిఎ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. తమ ప్రభుత్వ హయాంలో ఒక్క అవినీతి ఆరోపణ లేదని అన్నారు.
దీర్ఘకాలిక ప్రణాళిక..
తమకు దీర్ఘకాలిక ప్రణాళికతో లక్ష్యం ఉందని అన్నారు. వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు భారత్ వికాస్ చేపట్టామని, ఇప్పుడు ప్రతి ఒక్క భారతీయుడు ఇది తమ ప్రభుత్వమని గర్వంగా చెప్పుకోవచ్చని అన్నారు. పట్టణాలు, గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని, విదేశీ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన చెప్పారు. జన్‌ధన్ కార్యక్రమం కింద సుమారు 22 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిపించామని, ముద్రాయోజన కింద 1.37 లక్షల కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చినట్లు ఆయన చెప్పారు. భేటీ బచావో, భేటీ పఢావో, వంట గ్యాస్, రోడ్లు, కొత్తగా రైల్వే లైన్లు, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం తదితర పథకాల గురించి ఆయన వివరించారు. వికాస్ పర్వ్ కాదు వినాశ్ పర్వ్ అని, నరేంద్ర మోదీ టూరిస్ట్ ప్రధానిగా మారారని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా, ‘కాంగ్రెస్ విమర్శించకుండా మెచ్చుకుంటుందా?’ అని ఆయన ఎదురు ప్రశ్నించారు.శివసేన గురించి ప్రశ్నించగా, ఎన్డీఏలో ప్రజాస్వామ్యం ఉందని, ఆ సంగతి తాము చూసుకుంటామని అన్నారు. చంద్రబాబు నాయుడు పట్ల బిజెపి నాయకులు అసంతృప్తిగా ఉన్న విషయం గురించి ప్రశ్నించగా, ఆ నాయకులు ఎవరో చెప్పాలని ఆయన ఆ విలేఖరినుద్దేశించి ఎదురు ప్రశ్నించారు.ఎపికి ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించగా, ఇందులో సాంకేతిక అంశంపై 14వ ఆర్థిక సంఘం పరిశీలనలో ఉందని, అయినా ప్రత్యేక హోదాతో సమానంగా అన్ని సమకూరుస్తున్నామని అమిత్ షా సమాధానంగా వివరించారు.