ఆంధ్రప్రదేశ్‌

మహానాడులో జన్మదిన వేడుకలు జరుపుకోవడం అదృష్టం : బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 29: తిరుపతిలో జరుగుతున్న మహానాడులో తమ జన్మదినోత్సవాలను జరుపుకోవడం అదృష్టమని, ఈ అవకాశం కొందరికే లభించిందని టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం మహానాడు సభలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, మోదుగుల, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తమ జన్మదినోత్సవాలను జరుపుకున్నారు. మహానాడు వేదికపైన చంద్రబాబు నాయుడు కేక్ కట్ చేసి జన్మదినోత్సవాలు జరుపుకున్న వారికి తినిపించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రత్తిపాటి, మోదుగుల, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ సిఎం పాదాలకు నమస్కరించి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ జన్మదినోత్సవాలను కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య జరుపుకుంటారని అన్నారు. అయితే తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ సభ్యుల మధ్య జరుపుకునే అదృష్టం కొందరికే లభిస్తుందని అన్నారు. ఆదివారం జన్మదినోత్సవం జరుపుకున్నవారంతా అదృష్టవంతులని ఆయన పేర్కొన్నారు.

కాపులకు న్యాయం టిడిపితోనే సాధ్యం
హామీలిచ్చినా లేఖలెందుకో
ముద్రగడపై చినరాజప్ప ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
తిరుపతి, మే 29: రాష్ట్రంలోని కాపులను బిసి జాబితాలో చేరుస్తామని, వారి సంక్షేమానికి, అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని సి ఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన హామీ ఇచ్చాక కూడా ముద్రగడ పద్మనాభం ఎందుకు రోజుకోలేఖ రాస్తున్నారో అర్థం కావడం లేదని డిప్యూటి సి ఎం చినరాజప్ప అన్నారు. ఆదివారం మహానాడు మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ కాపులకు న్యాయం చేసేది టిడిపి ఒక్కటే అన్నారు.కాపులను బిసిల్లో చేర్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నా టిడిపి మాట వినకుండా ఆయన వైకాపా, కాంగ్రెస్‌ల వెంట ఎందుకు వెడుతున్నారో చెప్పాలని అన్నారు.కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వెయ్యికోట్లు కూడా కేటాయించమని ఆయన చెప్పారు.