జాతీయ వార్తలు

మళ్లీ కొలీజియం వేడి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: కొలీజియం వ్యవహారం మరోసారి కేంద్ర ప్రభుత్వానికి, న్యాయస్థానానికి మధ్య సంఘర్షణకు దారితీసే అవకాశం ఉందా? జాతీయ ప్రయోజనాల పేరుతో తమ సిఫార్సులను తిరస్కరించేందుకు ప్రభుత్వానికి గల హక్కును సుప్రీం కోర్టు ప్రశ్నించింది. కొలీజియం తన సిఫార్సులను పునరుద్ఘాటిస్తే..వాటిని ప్రభుత్వం తప్పసరిగా పాటించాలన్న నిబంధన ఉందని, అలాంటప్పుడు జాతీయ ప్రయోజనాల పేరుతో ఈ సిఫార్సులను ఎలా తిరస్కరిస్తారని తెలిపింది. దీనితో పాటు మరో క్లాజుపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సుప్రీం కోర్టు, 24హైకోర్టుల న్యాయ మూర్తులకు నియామకానికి సంబంధించిన నియమావళిని (ఎమ్‌ఓపి) వెనక్కి పంపింది. అయితే ఈ నియమావళిని సుప్రీం కోర్టు పూర్తిగా తిరస్కరించలేదని, కేవలం కొన్ని క్లాజుల విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తం చేసిందని ఉన్నతాధికార వర్గాలు వివరించాయి. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ సారథ్యంలోని కొలీజియం ఈ సందర్భంగా కొన్ని మార్పులనూ సూచించిందని తెలిపాయి. ప్రభుత్వం సవరించిన నియమావళి ప్రకారం..ఓ సారి సుప్రీం సిఫార్సును ప్రభుత్వం తిరస్కరిస్తే దానిపై అత్యున్నత న్యాయస్థానం పట్టుబట్టినా దాన్ని పునఃపరిశీలించాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నట్టుగా దీన్ని రూపొందించారు. దీన్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఇక రెండో క్లాజు.. సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులకు సంబంధించింది. ఈ విషయంలో కేంద్రంలో అటార్నీ జనరల్, రాష్ట్ర స్థాయిలో అడ్వకేట్ జనరల్‌కు కీలక పాత్ర కల్పించాలని కేంద్రం భావించింది. దీని పట్ల కూడా సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్లాజు వల్ల సుప్రీం కోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకంలో ప్రభుత్వం పరోక్షంగా ప్రమేయం కల్పించుకునే అవకాశం ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. కాగా, సుప్రీం కోర్టు తాజా సూచనల నేపథ్యంలో తదుపరి చర్యలకు సంబంధించి కేంద్రం అటార్నీ జనరల్ అభిప్రాయం కోరింది.