తెలంగాణ

మానస సరోవర్‌లో యాత్రికులు సురక్షితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, మే 30: మానస సరోవర్ యాత్రకు వెళ్లి వాతావరణం అనుకూలించకపోవడంతో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ ప్రభుత్వం రంగంలోకి దిగింది. సోమవారం ఐదు హెలికాప్టర్లను నేపాల్ టూరిజం వారు సమకూర్చడంతో నేపాల్ ప్రభుత్వం సహయక చర్యలు చేపట్టినట్లు సమాచారం. గంటసేపు వాతావరణం అనుకూలించడంతో ముందుగా ఐదు హెలిక్యాప్టర్ల ద్వారా మహిళలను చైనా, నేపాల్ సరిహద్దులోని హిల్సా నుండి సిమికోట్ ప్రాంతానికి తరలించారు. వారిలో 20 మంది తెలుగు మహిళలే ఉన్నారు. అందులో ఆరుగురు మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన శారద, అనితారెడ్డి, చేతన, శైలజతోపాటు మరో ఇద్దరున్నారు. ముందుగా మహిళలను తరలించి పురుషులను ఆ తర్వాత తరలించాలనుకున్న నేపాల్ సిబ్బందికి మరోసారి వాతావరణం అనుకూలించక సహాయక చర్యలు నిలిచిపోయాయి. వాతావరణం ఎప్పుడు అనుకూలిస్తే అప్పుడు సహయక చర్యలు చేపట్టేందుకు నేపాల్ టూరిజం వారు అప్రమత్తంగా ఉన్నట్లు తెలిసింది. అయితే యాత్రలో తమ వారి ఎంత ఇబ్బందులు పడుతున్నారోనని ఇక్కడ మాత్రం కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
పొగాకు బోర్డు డైరెక్టర్ల నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
గుంటూరు, మే 30: భారత పొగాకు బోర్డు డైరెక్టర్లను నియమిస్తూ కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీచేసింది. ఏపి నుంచి ఇద్దరు, కర్ణాటక నుంచి మరో ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒకరితో కలుపుకుని మొత్త ఐదుగురు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఏపి నుంచి పశ్చిమ గోదావరికి చెందిన గద్దమడుగు సత్యనారాయణ, ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని సీతయ్య, కర్ణాటక నుంచి మైసూరుకు చెందిన పివి బసవరాజప్ప, హుబ్లీకి చెందిన కిరణ్‌కుమార్, ఉత్తరప్రదేశ్ నుంచి కెకె మిశ్రా నియమితులయ్యారు. పొగాకు బోర్డు సభ్యులు 24 మందిలో ఈ ఐదుగురిని రైతుల తరఫున ప్రతినిధులుగా ఎంపిక చేశారు. నూతన డైరెక్టర్లు మూడేళ్లపాటు పదవిలో కొనసాగుతారు.
కోమటిరెడ్డి బ్రదర్స్ జంప్?
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మే 30: నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కోమటిరెడ్డి బ్రదర్స్‌గా ముద్రపడిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ‘కారు’ ఎక్కనున్నట్లు ఊహగానాలు ఊపందుకున్నాయి. అయితే అవన్నీ వదంతులేనని ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. మల్కాజిగిరి టిడిపి ఎంపి మల్లారెడ్డి కూడా టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు ఊహాగానాలు రాగా పార్టీ నాయకులు తోసిపుచ్చారు.