ఆంధ్రప్రదేశ్‌

వేద పండితుల వినూత్న నిరసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 30: ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది అనే చెప్పే పురాణ పండితుల పట్ల టిటిడి సైతం అధర్మంగా ప్రవర్తించడం దారుణమని బాలాజీ పురాణ పండితుల యూనియన్ గౌరవ అధ్యక్షుడు కందారపు మురళి విమర్శించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌లో పని చేస్తున్న పురాణ పండితులు సోమవారం టిటిడి పరిపాలనా భవనం ఎదుట పురాణ ప్రవచనంతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాణాలను ఔపోసనపట్టి, పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన పండితుల చేత 20 సంవత్సరాలుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని విమర్శించారు. పురాణ పండితులను పర్మినెంట్ చేయాలని గత టిటిడి ఇవో ఐవైఆర్ కృష్ణారావు 2010లోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారని అన్నారు. గత ఆరేళ్లుగా ఉత్తర ప్రత్యుత్తరాలు తప్ప వారిని పర్మినెంట్ చేయడానికి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదన్నారు. ఈనేపథ్యంలోనే ముగ్గురు పురాణ పండితులు మృత్యువాత పడ్డారని, మరో ఇద్దరు పండితులకు 58 సంవత్సరాలు నిండాయన్నారు. ఇప్పటివరకు వారి కుటుంబాలు ఎలాంటి సౌకర్యాన్ని పొందలేదని తెలిపారు. పురాణ పండితులకు గుర్తింపుకార్డులు పొందలేని పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా టిటిడి ఇవో సాంబశివరావు జోక్యం చేసుకుని వారికి న్యాయం చేయాలన్నారు. లేనిపక్షంలో ఎన్ని రోజులైనా టిటిడి పరిపాలనా భవనం ముందు తమ నిరసన కొనసాగిస్తూనే ఉంటామన్నారు. పగలు మహిళా పండితులు, రాత్రిపూట పురుష పండితులు ఓ యజ్ఞంలా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. యూనియన్ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి, కార్యదర్శి కరుణాకర్‌రెడ్డి, గంగులప్ప, రఘు, రామకృష్ణ, రవి, లోకనాథరెడ్డి, జయరాం పాల్గొన్నారు.

మూడు రోజుల్లో
2 లక్షల మందికి దర్శనం
తిరుమల, మే 30: వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో గత మూడు రోజులుగా శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడింది. మూడు రోజుల్లో రెండు లక్షల 735 మంది స్వామివారిని దర్శించుకోగా, 8 కోట్ల ఒక లక్ష రూపాయలు హుండీ ఆదాయం లభించింది. 8,02,927 లడ్డూలను భక్తులకు విక్రయించారు. 1,18,732 మంది తలనీలాలు సమర్పించారు. ఇక టిటిడి అన్నదాన భవన సముదాయంలోను, క్యూలైన్లలోను, యాత్రసదన్‌లోను అల్పాహారం, భోజన వసతి పొందినవారు 4 లక్షల 28వేల మంది ఉన్నారు. 28వ తేదీన 97,351 మంది స్వామివారిని దర్శించకోగా, 29వ తేదీన 1,03,384 మంది రికార్డుస్థాయిలో దర్శించుకున్నారు. తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో 27న 77,220 మంది, 28న 78,350 మంది, 29న 82,570 మంది సౌకర్యాన్ని పొందారు. యాత్రసదన్‌లో 23,150 మంది అన్నప్రసాదాన్ని పొందారు. సోమవారం సర్వదర్శనంలో వెళ్లే భక్తులకు 12 గంటలు, కాలినడకన వెళ్లే భక్తులకు 6 గంటల సమయం, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు పడుతోంది.

24 మందిని
కరచిన పిచ్చికుక్క
చిలకలూరిపేట, మే 30: ఒక పిచ్చికుక్క సోమవారం గుంటూరు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో స్వైరవిహారం చేసి 24 మందిని తీవ్రంగా గాయపరిచింది. పట్టణంలోని సుభానినగర్, రాజన్నపాలెం, అడ్డరోడ్డు సెంటర్, సుబ్బయ్యతోట పలు ప్రాంతాల్లో రోడ్లపై తిరుగుతూ సుమారు 2 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు వయస్సు గల పలువురిని కరిచింది. పిచ్చికుక్క బారిన పడిన వారిని చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా తీవ్రంగా కుక్కకాటుకు గురైన వారికి వేసే వ్యాక్సిన్ అక్కడ లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.