కెవిపి దారెటు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డిపై దివంగత వైఎస్ ఆత్మబంధువయిన రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేవీపీ చేసిన వ్యాఖ్యలు, ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. తన ఆత్మబంధువు కొడుకయిన జగన్‌ను, ఆయన తన మేనల్లుడిగా సంబోధించారు. అదేవిధంగా జగన్ తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోలేదని, ఆయనపై ఉన్న కేసులు కోర్టుల్లో ఉన్నందున, జగన్‌ను దోషిగా భావించలేమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో కేవీపీ వైసీపీలో చేరుతున్నారా అన్న చర్చకు సహజంగానే తెరలేచింది. సోషల్ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతోంది. దానిపై ప్రత్యేక కథనాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇక కోలుకునే పరిస్థితి లేకపోవడం, జగన్ పార్టీ ఒక్కటే ప్రత్యామ్నాయంగా ఉండటంతో.. కెవిపి వైసీపీలో చేరుతున్నారన్న వ్యాఖ్యలకు బలం చేకూర్చాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఓటు బ్యాంకు కకావికలమై, అది జగన్ పార్టీ ఖాతాలో కలవడం వల్లే వైసీపీ 67 స్థానాలు సాధించిన విషయం తెలిసిందే. అందువల్ల కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు తిరిగి సంపాదించుకోవాలంటే, సహజ రాజకీయ సమీకరణ సూత్రం ప్రకారం, వైసీపీని బలహీనం చేస్తేనే అది సాధ్యమవుతుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడయిన కెవిపి, ఇప్పటివరకూ జగన్‌ను గానీ, ఆయన పార్టీని గానీ ఎక్కడా విమర్శించిన దాఖలాలు లేవు. అదే సమయంలో కెవిపి మీద విదేశాల్లో కేసు నమోదయిన సందర్భంలో జగన్ పార్టీ నేతలు వౌనం వహించగా, వీహెచ్, మధుయాష్కీ, టిడిపి నేతలు మాత్రమే స్పందించిన విషయాన్ని కూడా పరిశీలకులు తమ వాదనకు మద్దతుగా గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ జగన్‌పై కెవిపి చేసిన సానుకూల వ్యాఖ్యల నేపథ్యంలో మొదలైన రాజకీయ చర్చగానే కనిపిస్తోంది. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న చర్చపై కెవిపి తన వివరణ ఇచ్చుకోవడం, అనివార్యంలా కనిపిస్తోందని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.