రాష్ట్రీయం

వ్యాట్‌ను ఎత్తివేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలంగాణ ప్రభుత్వం వెంటనే వ్యాట్‌ను ఎత్తివేయాలని డీజిల్, పెట్రో ట్యాంకర్ల అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ చర్లపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్) ముందు అసోసియేషన్ మంగళవారం ఆందోళనకు దిగింది. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ, వ్యాట్‌తో ట్యాంకర్ల యజమానులు ప్రతినెలా రూ.20 వేల నుంచి 25 వేలు నష్టపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ట్యాంకర్లను నడుపుతున్నామని, ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ట్యాంకర్లపై వ్యాట్ వేయలేదన్నారు. వ్యాట్‌ను ఎత్తివేయాలని కోరుతూ రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్, కమిషనర్ అనిల్‌కుమార్‌ను కోరామని వారు తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పునరాలోచించి వ్యాట్‌ను ఉపసంహరించుకోవాలని అసోసియేషన్ నేత బుచ్చయ్య యాదవ్ డిమాండ్ చేశారు.