రాష్ట్రీయం

టిఆర్‌ఎస్‌లోకి ఎంపి మల్లారెడ్డి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 31: తెలుగు దేశం పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజులుగా మల్లారెడ్డి టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నా, ఆయన ఖండించలేదు. ఇలాఉండగా జూన్ 2న రాష్ట్రావతరణ దినోత్సవం వేడుకలకు ముందు సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. మల్లారెడ్డి పార్టీ ఫిరాయించకుండా టిడిపి నేతలు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను టిఆర్‌ఎస్‌లో చేరాల్సిన అవశ్యకత ఉందని మల్లారెడ్డి తనను సంప్రదించిన నాయకులకు చెప్పినట్లు తెలిసింది.