రాష్ట్రీయం

నేటి నుండి శ్రీవారి ప్రభాత సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మే 31: ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో బుధవారం నుంచి శ్రీవారి ప్రభాత సేవలను ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టామని టిటిడి ఇఓ డాక్టర్ డి.సాంబశివరావు వెల్లడించారు. మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో ఆకాశవాణి తిరుపతి కేంద్రం అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇఓ మాట్లాడుతూ, తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతినిత్యం తెల్లవారుజాము నుంచి నిర్వహించే సుప్రభాతం, తోమాల, అర్చన సేవల్లో పాల్గొనలేని భక్తులు ఆకాశవాణి ద్వారా వాటిని విని తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించుకొనే అద్భుతమైన అవకాశం టిటిడి కల్పిస్తోందన్నారు. ప్రతిరోజూ ఉదయం 3 నుంచి 6 గంటల వరకు స్వామివారి సేవలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారని తెలిపారు. ఇందులో ఉదయం 3 నుంచి 3.30 గంటల వరకు సుప్రభాతం, 4 నుంచి 4.30 గంటల వరకు తోమాల సేవ, 4.40 నుంచి 5.30 వరకు అర్చనసేవలు ప్రసారమవుతాయన్నారు. సేవల మధ్యలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు, సామవేద షణ్ముఖ శర్మ లాంటి పండితులు ఈ సేవల వైశిష్ట్యాన్ని, స్వామివారి వైభవాన్ని ప్రవచిస్తారన్నారు. అలాగే అన్నమయ్య సంకీర్తనలు కూడా ప్రసారమవుతాయని ఇఓ తెలిపారు.
ఉదయం 5.30 నుంచి 6 గంటల వరకు తిరుమల సమాచారంలో భాగంగా స్వామివారి దర్శనానికి పట్టే సమయం, భక్తులు వేచి ఉన్న కంపార్టుమెంట్లు, ఖాళీగా ఉన్న వసతి గదులు తదితర వివరాలు కూడా భక్తులకు అందిస్తామన్నారు. ఆకాశవాణిలో 2006వ సంవత్సరం వరకు స్వామివారి సుప్రభాత సేవ ప్రత్యక్ష ప్రసారం జరిగిందన్నారు. తిరిగి బుధవారం నుంచి ఈ ప్రసారాలను పునఃప్రారంభిస్తారన్నారు. శ్రీవారికి జరిగే ఉదయాత్ఫూర్వం నిర్వహించే ఈ సేవలను భక్తులందరూ విని తరించాలని ఇఓ కోరారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి సంవత్సరానికి 11 లక్షల రూపాయలు చెల్లించడం ద్వారా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని భక్తులకు శ్రీవారి సుప్రభాత సేవలను వినిపించడంతో పాటు తిరుమలకు సంబంధించిన అనేక సమాచారాలను తెలియజేసే అవకాశం ఉంటుందని ఇఓ తెలిపారు.
ఆకాశవాణి మొత్తం ప్రసారాలు 17 గంటలు కాగా ఇందులో 3 గంటల సమయాన్ని టిటిడికి కేటాయించడం ముదావహమన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ కె.విజయ మాట్లాడుతూ తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు తమ ప్రసారాలు అందుతున్నాయన్నారు. తిరుమలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందించడంతో పాటు టిటిడి అమలుచేస్తున్న వివిధ పథకాల వివరాలు, హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యక్రమాలను కూడా ప్రచారం చేస్తామని ఆయన తెలిపారు.