రాష్ట్రీయం

ప్రజావినతుల మేరకే ఇసికి లేఖ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, మే 31: తమిళనాడులోని తంజావూరు, అరవకురిచ్చి అసెంబ్లీ నియోజకవర్గాలకు జూన్ మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశానని, ఇటీవల ఎన్నికలు ఆగిపోయిన ఈ రెండు నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించే ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎన్నికల్లో ఓట్లు కోల్పోనున్నందున ఈ లేఖ రాశానని ఆ రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య స్పష్టం చేశారు.
శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన మంగళవారం ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ, ఆ రెండు నియోజకవర్గాలకు త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ లేఖ రాశానన్నారు. ఈ వ్యవహారంలో తనకు ప్రత్యేక ఆసక్తి ఏమీ లేదని, ఈ రెండు నియోజకవర్గాల్లో ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కల్పించాలన్న ఆలోచనతోనే ఇసికి లేఖ రాశానని చెప్పారు. అయితే ఇటువంటి లేఖ రాయకూడదంటూ ఎన్నికల కమిషన్ తనను తప్పుబట్టడంపై వ్యాఖ్యానించబోనని రోశయ్య అన్నారు. ఇటీవల తమిళనాడు శాసనసభ ఎన్నికల సందర్భంగా భారీగా డబ్బు పంపిణీ, రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు రావడంతో తంజావూరు, అరవకురిచ్చి నియోజకవర్గాల ఎన్నికలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ రెండు నియోజకవర్గాల్లో మే 23వ తేదీన రీ-ఎలక్షన్ జరపాలని నిర్ణయించినప్పటికీ కొన్ని రాజకీయ పార్టీల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో రాజకీయ వాతావరణం కలుషితమైందని, ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు అనువైన పరిస్థితులు లేవని ఎన్నికల కమిషన్ తన లేఖకు సమాధానిమిచ్చినట్లు రోశయ్య తెలిపారు. ఆయన వెంట మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అంధవరపు వరాహనరసింహం తదితరులు ఉన్నారు.

చిత్రం శ్రీకాకుళం రోడ్లు, భవనాలు అతిథి గృహంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతున్న తమిళనాడు గవర్నర్ రోశయ్య