రాష్ట్రీయం

అంబరాన్ని తాకిన సంబరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ రెండవ వార్షికోత్సవ వేడుకలు గురువారం రాష్టవ్య్రాప్తంగా అత్యంత వైభవోపేతంగా జరిగాయి. తొలి ఏడాది నిర్వహించిన దానికంటే రెండవ ఏడాది నిర్వహించిన ఈ వేడుకలు మరింత ఘనంగా జరగడం విశేషం. మొదటి సంవత్సర వేడుకలు రాష్ట్ర రాజధానికే ప్రాధాన్యత ఇవ్వగా, ఈ సారి వీటిని రాష్టవ్య్రాప్తంగా నిర్వహించడం విశేషంగా చెప్పుకోవచ్చు. రాష్ట్ర అవతరణ వేడుకలు గతంలో పరేడు గ్రౌండ్‌లో నిర్వహించే సభకు మాత్రమే పరిమితమయ్యేలా ఉండేవి. ఈసారి అలా కాకుండా సంజీవయ్య పార్క్‌లో అతి పెద్ద జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఆవిష్కరించడం, హుస్సేన్‌సాగర్ తీరాన లుంబినీ పార్క్‌లో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపానికి శంకుస్థాపన చేయడం, హెచ్‌ఐసిసిలో గవర్నర్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. రాష్ట్ర అవతరణను పురస్కరించుకుని వివిధ రంగాల నుంచి 62 మంది ప్రతిభావంతులను ఎంపిక చేసి ఇక్కడే అవార్డులను అందించడం ఈసారి జరిగిన మరో ప్రత్యేక కార్యక్రమంగా చెప్పకోవచ్చు. అంతేకాకుండా రాజధాని నగరం మిరిమిట్లు కొలిపేవిధంగా హుస్సేన్‌సాగర్ తీరంలో ఏర్పాటు చేసిన డిజిటల్ షో సందర్శకులను కట్టిపడేసింది. రాష్ట్రావతరణ వేడుకలు ఒక్క పరేడు గ్రౌండ్‌కే పరిమితం కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఘనంగా జరిగాయి. రాష్టవ్య్రాప్తంగా ఊరు, వాడల్లోనూ ఈ సారి అవతరణ వేడుకలను నిర్వహించడం అక్కడికి వచ్చిన వారికి ప్రభుత్వం తరఫున స్వీట్లు పంచిపెట్టడం, ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు పంచే కార్యక్రమాలను కూడా ప్రభుత్వ ఖర్చుతోనే నిర్వహించింది. అవతరణ వేడుకల నిర్వహణకు గతంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి అధికారులు ఇబ్బంది పడేవారు. అయితే ఈసారి జిల్లాకు పది కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వం ముందుగానే నిధులు విడుదల చేయడంతో ఖర్చుకు వెనుకాడకుండా వేడుకలను ఘనంగా నిర్వహించగలిగారు.