తెలంగాణ

మధ్యంతర ఉత్తర్వుల సమీక్షపై తీర్పు రిజర్వ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 11: జూనియర్ సివిల్ జడ్జిల నియామకాలను చేపట్టాలని జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై తీర్పును రిజర్వు చేసినట్లు హైకోర్టు ధర్మాసనం శుక్రవారం ప్రకటించింది. హైకోర్టు విభజన జరిగే వరకు న్యాయాధికారుల నియామకంపై స్టే ఇవ్వాలని సీనియర్ న్యాయవాది ఎస్ సత్యంరెడ్డి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు సుదీర్ఘంగా విచారించింది. నియామకపు ఉత్తర్వులు జారీ చేయడానికి సమయం పడుతుందని, తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని పేర్కొన్నామని కోర్టు తెలిపింది. న్యాయాధికారుల నియామకాన్ని సమీక్షించాలని దాఖలైన పిటిషన్‌పై త్వరలోనే నిర్ణయాన్ని వెలువరిస్తామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

రాష్టప్రతికి సిఎం కెసిఆర్
జన్మదిన శుభాకాంక్షలు

ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 11: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన ప్రణబ్ ముఖర్జీ ఆయురారోగ్యాలతో శత వసంతాలు పూర్తి చేసుకోవాలని, ప్రజలకు మరింతగా సేవలు అందించాలని దైవాన్ని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ప్రణబ్ ముఖర్జీకి శుభాకాంక్షలు తెలిపే సందేశాన్ని ముఖ్యమంత్రి ఫ్యాక్స్ ద్వారా పంపించారు.

టిఎస్‌పిఎస్‌సికి స్కోచ్ అవార్డు

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టిఎస్‌పిఎస్‌సి)కు అత్యంత ప్రతిష్ఠాత్మక ‘స్కోచ్ అవార్డు’ లభించింది. టిఎస్‌పిఎస్‌సి విజయవంతంగా సిబిఆర్‌టి పరీక్షను నిర్వహించినందుకు గాను ఈ అవార్డుకు ఎంపికైంది. ముంబయిలోని ఇండియన్ హబిటా సెంటర్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో స్కోచ్ గ్రూప్ చైర్మన్ సమీర్ కొచ్చర్, ముంబయి ఐఐటి డైరక్టర్ బి.పాఠక్‌ల చేతుల మీదుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ప్రొ.ఘంటా చక్రపాణి ఈ అవార్డును అందుకున్నారు.

విజయవాడ సదస్సుకు తెలంగాణ మంత్రులు

హైదరాబాద్, డిసెంబర్ 11: శనివారం విజయవాడలో జరిగే దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సదస్సులో తెలంగాణ మంత్రులు పాల్గొంటారు. ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, హోంమంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, స్పెషల్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రదీప్ చంద్ర సదస్సులో పాల్గొనేందుకు విజయవాడ వెళుతున్నారు.

ముగ్గురు డిఎస్పీల బదిలీ

హైదరాబాద్, డిసెంబర్ 11: తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు డిఎస్పీలను బదిలీ చేస్తూ డిజిపి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. రైల్వే ఎస్పీపై లైంగిక ఆరోపణల కేసుకు సంబంధించి సికింద్రాబాద్ రైల్వే డిఎస్పీగా పని చేస్తున్న పివి మురళీధర్‌పైనా బదిలీ వేటు పడింది. ఆయనను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. కాగా ఆయన స్థానంలో పోస్టింగ్ కోసం వేచి ఉన్న టి.గోవర్థన్‌ను బదిలీ చేశారు. మరో డిఎస్పీ కె.వెంకటేశ్వర్లు పోస్టింగ్ కోసం వేచి ఉండగా, ఆయనను హైదరాబాద్ సిటీ ఎసిపిగా బదిలీ చేశారు.