ఆంధ్రప్రదేశ్‌

ఒక్కొక్కరూ పదేసి మొక్కలు నాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 5: ప్రతిఒక్కరూ పది మొక్కలు నాటాలని, రాష్ట్రంలోని 5కోట్ల జనాభా ఒక్కొక్కరూ పది మొక్కలు నాటితే 50కోట్ల మొక్కలు పెరుగుతాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని గొల్లపూడి మార్కెట్ యార్డు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విద్యార్థుల చేత మొక్కలు నాటించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చంద్రబాబు తరువాత జరిగిన సభలో ప్రసంగించారు. నర్సరీల్లో 15కోట్ల మొక్కలు పెంచాలని పిలుపిచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగలు, అతి ముఖ్యమైన పర్వదినాల్లో అందరూ మొక్కలు నాటటం అలవాటుగా చేసుకోవాలని కోరారు. ఈ మంచి సంప్రదాయాన్ని అందరూ విధిగా పాటించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జూన్‌లో వర్షాలు ప్రారంభమైన నాటి నుండి డిసెంబర్ వరకు ఉద్యమంలా మొక్కలు నాటాలన్నారు.
వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని భూగర్భ జలాలను పెంచుంకోవాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపిచ్చారు. జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వవరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 40వేల చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టి 2వేల కోట్లతో 18కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి పొలాలకు ఎరువుగా వేయించామన్నారు. ప్రతిఒక్కరూ విధిగా 10 మొక్కలు నాటాలని మంత్రి ఉమ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.