రాష్ట్రీయం

అక్రమ నిర్మాణాలు పట్టవా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు చేసినా జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదు చేసినా స్పందించక పోవడానికి కారణం ఏమిటో ఈ నెల 24న కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాల్సిందిగా జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రెండు అంతస్తుల భవనానికి అనుమతి తీసుకొని నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నట్టు హైదరాబాద్ పాతబస్తీ ఫీల్‌ఖానాకు చెందిన బాల్ ముకుంద్ మిశ్రా అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ సివి నాగార్జునరెడ్డి జిహెచ్‌ఎంసి అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.