రాష్ట్రీయం

‘అమరావతి ఇటుక’కు బేరాలు నిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 6: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు నాయుడు అట్టహాసంగా ప్రారంభించిన ‘నా ఇటుక- నా అమరావతి’కి బేరాలు కరువయ్యాయి. కొత్త రాజధానిలో అందరినీ భాగస్వాములను చేసేందుకు సిఆర్‌డిఎ నేతృత్వంలో గత ఏడాది అక్టోబర్ 15న ‘నా ఇటుక - నా అమరావతి’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఒక్కో ఇటుకకు 10 రూపాయల చొప్పున వసూలు చేస్తూ ఆన్‌లైన్‌లో కొనుగోలుదారుల వివరాలను సిఆర్‌డిఎ పొందుపర్చింది. కార్యక్రమం ప్రారంభమైన మూడురోజుల్లోనే ఔత్సాహికులు 18 లక్షల ఇటుకలు కొనుగోలు చేశారు. ఎన్నారైలు సైతం ఆన్‌లైన్ ద్వారా ఇటుకలను విరాళంగా అందించేందుకు ముందుకొచ్చారు.
అయితే ప్రచారం లేకపోవడంతో ప్రజాస్పందన కరవైంది. ఆన్‌లైన్‌లో వివరాలు కొంతమందికే పరిమితం కావడంతో ఇటుకకు గిరాకీ తగ్గింది. ఇప్పటివరకు 55 లక్షల 63 వేల 658 ఇటుకలను 2 లక్షల 25 వేల 613 మంది కొనుగోలు చేశారు. రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన గతేడాది అక్టోబర్ 22వ తేదీకే మూడు బిలియన్ల ఇటుకల విక్రయం లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది.
అయితే ఇప్పటికీ కోటికి కూడా చేరుకోక పోవడం గమనార్హం. అమరావతికి విరాళంగా ఇచ్చే ఇటుకల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు కేవలం 5.5 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. మరో మూడు నెలల్లో ఏడాది పూర్తికావస్తున్నా స్పందన నామమాత్రం కావడంతో సిఆర్‌డిఎ అధికారులు విస్తృత ప్రచారం కల్పించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఆన్‌లైన్‌తో పాటు కరపత్రాలు, పోస్టర్ల ప్రచారం ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. అమరావతి ఇటుకలకు ప్రజాభాగస్వామ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు అంతగా చొరవచూపడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.