ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కి వస్తున్న ఇంజనీరింగ్ ఫీజులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 9: తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల ఖరారు వ్యవహారం ఊపందుకుంది. ఇప్పటికే ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఇప్పటికే పలుమార్లు యాజమాన్యాల ప్రతినిధులతో సమావేశమై వారి అభిప్రాయాలను సేకరించింది. 20వేలు, 35వేలు ఫీజు ఉన్న కాలేజీలు సైతం లక్ష రూపాయల వరకూ ఫీజు పెంచాలని కోరగా, మరికొన్ని ప్రముఖ కాలేజీలు రెండు రెట్లు అదనంగా ఫీజును కోరాయి. అయితే తాజాగా అఫిడవిట్లను లోతైన అధ్యయనం చేసిన ఎఎఫ్‌ఆర్‌సి కాలేజీల ఫీజులను ఆ మేరకు పెంచేందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. ఈ ఏడాది నిర్ణయించిన ఫీజులు రానున్న మూడేళ్లపాటు అమలులో ఉంటాయి. 2016-17, 2017-18, 2018-19 విద్యాసంవత్సరాలకు ఈ ఫీజు అమలులో ఉంటుంది. కాలేజీల ప్రతిపాదనలను సమీక్షించిన ఎఎఫ్‌ఆర్‌సి రానున్న పది రోజుల్లో మరింత లోతైన అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఫీజులపై స్పష్టత రాగానే ఆ మేరకు ఉన్నత విద్యామండలికి నివేదికను పంపుతారు. ఎఎఫ్‌ఆర్‌సి పరిశీలనల ప్రకారం చాలా కాలేజీల్లో ఫీజు 10వేలు మొదలు 20వేల వరకూ ఖరారు చేయాల్సి ఉంది. అదే జరిగితే రానున్న రోజుల్లో ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన ఎఎఫ్‌ఆర్‌సి కనీస ఫీజును 35వేల వరకూ ఖరారు చేయనున్నట్టు తెలిసింది. మంచి కాలేజీల్లో ఫీజు గరిష్టంగా 1.20 లక్షలు ఉండే వీలుంది. సాధారణ కాలేజీల ఫీజు 35వేలు ఉంటుంది. ఎ గ్రేడ్ కాలేజీల ఫీజు లక్ష వరకూ, బి గ్రేడ్ కాలేజీలు ఫీజు 75వేలు వరకూ, సి గ్రేడ్ కాలేజీల ఫీజు 65 వేల వరకూ, మిగిలిన కాలేజీల ఫీజు కనిష్టంగా 35వేల వరకూ ఉంటుందని విద్యాశాఖాధికారులు పేర్కొన్నారు.