రాష్ట్రీయం

అక్షర యోధుడికి సర్కారు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: ‘తెలంగాణ అక్షర యోధుడు’ శీర్షికన ఆంధ్రభూమి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనంపై సిఎం కె చంద్రశేఖర్‌రావు స్పందించారు. తెలంగాణ ఉద్యమానికి అక్షరాయుధాలు అందించిన కెఎల్ రెడ్డి తీరని పేదరికంతో బతుకు పోరాటం చేస్తున్నారు. మరోపక్క వృద్ధ్యాపంలో సంక్రమించిన పార్కిసన్స్ వ్యాధితో ఇబ్బంది పడుతున్నారు. కథనంతో విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి కెసిఆర్ స్పందించారు. ప్రభుత్వ సాయంతో చికిత్స అందించేందుకు హామీ ఇస్తూనే, ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఆంధ్రభూమిలో కెఎల్ రెడ్డిపై వచ్చిన వ్యాసాన్ని చదవిన వెంటనే, ఆయన ఎక్కడ ఉంటున్నారో ఆరా తీసి తన వద్దకు తీసుకొని రావాలని సిఎం కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిని కెసిఆర్ ఆదేశించారు. వ్యాసంలో ప్రచురించిన ఫోన్ నెంబర్ ఆధారంగా కెఎల్ రెడ్డితో రాజశేఖర్‌రెడ్డి స్వయంగా మాట్లాడి సోమవారం సిఎం వద్దకు తీసుకెళ్తానని చెప్పారు. సిఎం కార్యాలయం నుంచి తనకు ఫోన్ వచ్చిన సమయంలో తన సోదరుని ఇంటిలో ఉన్నానని కెఎల్ రెడ్డి ఆంధ్రభూమి ప్రతినిధికి చెప్పారు. తనకు వచ్చిన పార్కిన్‌సన్స్ వ్యాధికి చికిత్స చేయించుకోవడానికి బంధువులు తలాకొంత ఆర్థిక సాయం చేయాలని అడగటానికి సోదరుని ఇంటికి వెళ్లినట్టు చెప్పారు. ఆ సమయంలోనే సిఎం కార్యదర్శి నుంచి తనకు ఫోన్ వచ్చిందన్నారు. తనకు సిఎం చేయబోయే ఆర్థిక సాయంపై ఆశ లేదని, అయితే నెలకు 10వేలు పెన్షన్ వచ్చేలా చేయడంతోపాటు, చికిత్స చేయిస్తే అదే పెద్దమేలని కెఎల్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి నెలనెలా పెన్షన్ వస్తే ప్రస్తుతం పోషణ కోసం చేస్తున్న ఉద్యోగం మానేసి మళ్లీ రచనా వ్యాసంగం చేపట్టాలని ఉందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.