తెలంగాణ

రూ.350 కోట్లతో పోలీస్ స్టేషన్ల ఆధునీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ నగరంలో పోలీస్‌ల సంక్షేమం, పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 350 కోట్లు కేటాయించిందని హోం శాఖ మంత్రి నాయిని నార్సింహరెడ్డి వెల్లడించారు. ప్రజా సంక్షేమానికి తెరాస ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పునరుద్ఘాటించారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రూ.35 లక్షల వ్యయంతో ఆధునీకరించిన పేట్‌బషీరాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్ల నూతన భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయిని మాట్లాడుతూ, దేశంలోని 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ ప్రభత్వుం ప్రజాసంక్షేమానికి రూ. 35 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు, మతసామరస్యం కోసం పోలీస్ శాఖ అడిగిన వనరులన్నీ కల్పించామని, పోలీసులకు ముఖ్యమంత్రి కెసిఆర్ రూ.350 కోట్లు కేటాయించారన్నారు. తెరాస ప్రభుత్వం రెండేళ్ల పాలనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ఇటీవల జరిగిన పుష్కరాల్లో పోలీసుల కృషి అభినందనీయమన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలంటే ప్రజలు భయపడేవారని, ఇప్పుడు ఆధునాతన సౌకర్యాలతో ఆన్‌లైన్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ప్రజలు తేలికగా ఫిర్యాదులు చేస్తున్నారన్నారని తెలిపారు. ఆధునిక టెక్నాలజీ వినియోగం వల్ల నేర నియంత్రణకు అడ్డుకట్ట పడుతుందన్నారు. పోలీస్ స్టేషన్ల నూతన భవన ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, సుధీర్‌రెడ్డి, ఎంపి మల్లారెడ్డి, మేయర్ బొంతు రాంమ్మోహన్, సైబరాబాద్ కమిషనర్ సివి.ఆనంద్, అడిషనల్ కమిషనర్ శశిధర్‌రెడ్డి, బాలానగర్ జోన్ ఇన్‌చార్జి డిసిపి వై.సాయిశేఖర్ తదితరులు పాల్గొన్నారు.