రాష్ట్రీయం

మానవ తప్పిదాలే విపత్తులకు కారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 20: మానవ తప్పిదాల వలనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న విపత్తుల నిర్వహణపై రెండో ప్రపంచ సదస్సులో భాగంగా రెండో రోజైన శుక్రవారం రెండు ప్లీనరీలు, తొమ్మిది సెషన్స్ జరిగాయి. రెండో రోజు సదస్సులో చర్చించిన అంశాల గురించి సాయంత్రం సదస్సు ప్రతినిధులు వివరించారు. మానవ తప్పిదాల వలన ప్రకృతి సమతౌల్యత దెబ్బతింటోన్న కారణంగా పలు విపత్తులు సంభవిస్తున్నాయని సదస్సు అభిప్రాయపడిందన్నారు.
పలు దేశాలు, రాష్ట్రాలు చట్టాలను సవరించి మరీ నదీ జలాలు స్వేచ్ఛగా ప్రవహించే ప్రదేశాల్లో కట్టడాలు నిర్మించడం వల్ల అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని సదస్సులో వక్తలు పేర్కొన్నారు. ఉత్తరాఖండ్‌లో వరదలు సంభవించి, భారీ ప్రాణ నష్టం వాటిల్లడానికి కారణం మానవ తప్పిదమేనని వక్తలు అభిప్రాయపడ్డారు.
విపత్తులు సంభవించకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ఒకవేళ వచ్చినా వాటిని ఎలా ఎదుర్కోవాలన్న అంశంపై పిల్లలకు ప్రాథమిక విద్యా స్థాయి నుంచే అవగాహన కల్పిస్తున్నామని గుజరాత్ నుంచి వచ్చిన ప్రతినిధులు తెలియచేశారు. ప్రకృతి వైపరీత్యాలపై చిన్నారులు వారికున్న అవగాహనను సదస్సులో తెలియచేశారు. ప్రాంతాన్నిబట్టి వైపరీత్యాలు మారుతుంటాయని, అన్నింటినీ ఒకేవిధంగా పరిగణించలేమని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనితా సింగ్ అన్నారు. ఈ సదస్సు అధ్యక్షుడు ఆనంద్‌బాబు మాట్లాడుతూ సదస్సు ఆశాజనకంగా జరుగుతోందన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధుల నుంచి మంచి స్పందన కనిపిస్తోందని అన్నారు.

డాక్టర్ హత్య కేసులో
నిందితులకు బెయిల్ నిరాకరణ

హైదరాబాద్, నవంబర్ 20: ఆంధ్ర రాష్ట్రంలో జన విజ్ఞాన వేదిక నేత, డాక్టర్ జి విజయకుమార్ రెడ్డిని నెల్లూరులో హత్య చేసిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసులో వెలగపూడి ఉషారాణి, జి సుందరయ్య, కునిశెట్టి శ్రీ్ధర్ నిందితులుగా ఉన్నారు. ఈ ఏడాది మే 28వ తేదీన విజయకుమార్ రెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో కుటుంబ సభ్యుల పాత్ర ఉందని పోలీసుల దర్యాప్తులో తేలినట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. ఆర్ధిక వ్యవహారాల వల్లనే ఈ హత్య జరిగినట్లు ప్రాసిక్యూషన్ ఆరోపించింది. ఈ కేసులో మృతుడు డాక్టర్ రెడ్డి తల్లి జయలక్ష్మమ్మ ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసి నిందితులకు బెయిల్ ఇవ్వరాదని కోర్టును అభ్యర్ధించారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఎలాంగో బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చారు.