రాష్ట్రీయం

ఢీ అంటే ఢీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 16:వైసీపీ నుంచి వలసలను ప్రోత్సహించి జగన్‌కు ఝలక్ ఇచ్చిన తెలుగుదేశం నాయకత్వానికి ఇప్పుడు బదిలీల వ్యవహారం తలనొప్పిలా పరిణమించింది. 20 నియోజకవర్గాల నుంచి చేరిన వైసీపీ ఎమ్మెల్యేలకు, అంతకుముందు నుంచే పార్టీలో పనిచేస్తున్న ఇన్చార్జిలకు బహిరంగయుద్ధం జరుగుతుండటంతో..బదిలీల విషయంలో ఎవరి మాటకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక టిడిపి నాయకత్వం తలపట్టుకుంది. ప్రకాశం, కడప, తూర్పు గోదావరి, కర్నూలుజిల్లాలో ఈ సమస్య ఎక్కువగా ఉంది. జన్మభూమి కమిటీలు, ఫీల్డ్ అసిస్టెంట్లనూ మార్చాలని కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కూడా పాత నేతల నుంచి తీవ్ర స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతోంది. ఏపిలో మొదలైన ప్రభుత్వ ఉద్యోగుల బదిలీ వ్యవహారం టిడిపికి ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చిన చందంగా మారింది. టిడిపిలో చేరిన జలీల్‌ఖాన్ (విజయవాడ వెస్ట్), గొట్టిపాటి రవి (అద్దంకి), పోతుల రామారావు (గిద్దలూరు),అశోక్‌రెడ్డి (కందుకూరు), అమర్‌నాధ్‌రెడ్డి (పలమనేరు), డేవిడ్‌రాజు (యరగొండపాలెం), జ్యోతుల నెహ్రు (జగ్గంపేట), వరుపుల సుబ్బారావు (పత్తిపాడు), సుజయకృష్ణరంగారావు (బొబ్బిలి), కలమట వెంకట రమణ (పాతపట్నం), సునీల్ (గూడూరు), భూమా నాగిరెడ్డి (నంద్యాల), అఖిలప్రియ (ఆళ్లగడ్డ), ఎస్వీమోహన్‌రెడ్డి (కర్నూలు), జయరాములు (బద్వేలు), ఆదినారాయణరెడ్డి (జమ్మలమడుగు), బుడ్డా రాజశేఖర్‌రెడ్డి (శ్రీశైలం), మణిగాంధీ (కోడుమూరు), చాంద్‌పాషా(కదిరి), సర్వేశ్వరరావు (అరకు) నియోజకవర్గాల్లో టిడిపి పాత నేతలకు, వీరికి బదిలీల వ్యవహారంలో ఎంత మాత్రం పొసగడం లేదు.
ట్రాన్స్‌కో, పోలీసు, రెవిన్యూ విభాగాలకు సంబంధించిన బదిలీలపై తమదే పైచేయి కావాలని ఇద్దరూ కుస్తీ పడుతున్నారు.ఆ ప్రకారంగా ఇరు వర్గాలు ఎవరి జాబితాలు వారు తయారుచేసుకుని, దానిని నాయకత్వానికి అందిస్తున్నారు. ముఖ్యంగా పోలీసు, రెవిన్యూ శాఖల్లో డిఎస్పీ, సీఐ, ఎస్‌ఐలు, రెవిన్యూలో ఎమ్మార్వో, ఆర్డీఓ బదిలీలపైనే పాత-కొత్త నేతలు పట్టుపడుతున్నారు. వీటిలో ఆదాయం ఎక్కువగా ఉండటం పక్కకుపెడితే, తమ మనుషులను నియమించుకుంటే, వారు ఎన్నికల్లో తమకు పనికివస్తారన్న ముందుచూపు కనిపిస్తోంది.
దానికంటే మించి ఒకసారి బదిలీలపై పైచేయి సాధిస్తే, ఇక ఆ నియోజకవర్గంలో తమదే పైచేయి అని, మిగిలిన వారికి నాయకత్వం వద్ద ఎలాంటి ప్రాధాన్యం లేదన్న సంకేతాలు పంపించడమే, వీరి ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ తమ డిమాండ్లు నెరవేర్చుకునే పనిలో ఉన్నారు.
వీరి ఒత్తిళ్లతో నాయకత్వం సతమతమవుతోంది. పాత వారిని కాదని కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇస్తే, లీడర్లు, క్యాడరు అసంతృప్తికి గురయి, సరైన సమయంలో వైసీపీ వైపు చూసే ప్రమాదం లేకపోలేదు. కొత్తవారిని కాదని పాతవారికి ప్రాధాన్యం ఇస్తే, కొత్తగా చేరిన వారిని కరివేపాకుల మాదిరిగా వాడుకుని వదిలేశారన్న సంకేతాలు వెళితే, ఇక పార్టీలో ఎవరూ కొత్తగా చేరే సాహసం చేయరు.
దీనితో ముందు జగన్‌ను దెబ్బతీయాలన్న ఉత్సాహంతో ఫిరాయింపులు ప్రోత్సహించిన నాయకత్వం, ఇప్పుడు ఆ 20 నియొజకవర్గాల్లో ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలో తెలియక తలపట్టుకుంది. అయితే, పార్టీలో చేరిన వారు ఉచితంగా ఏమీ రాలేదుకాబట్టి, వారిని పక్కకుపెట్టినా పెద్ద నష్టం లేదన్న వాదన కార్యకర్తల్లో వినిపిస్తోంది.
తాజాగా ప్రకాశం జిల్లాలో మొదలైన పంచాయితీ దేశం యువనేత లోకేష్‌కు శిరోభారంగా పరిణమించింది. అటు హామీలిచ్చి తీసుకువచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఇటు పార్టీకి పునాదిరాళ్లకు సర్దిచెప్పలేక, తాత్కాలిక హామీలిచ్చి పంపించాల్సిన సంకటస్థితి ఏర్పడింది. వైసీపీ ఎమ్మెల్యేలయిన గొట్టిపాటి రవికుమార్, రామారావు, అశోక్‌రెడ్డి తాజాగా లోకేష్‌ను కలిశారు. అద్దంకిలో కరణం బలరాం ఆగడాలు పెచ్చుపెరుగుతున్నాయని, తాను సీఐని బదిలీ చేయిస్తే దాన్ని బలరాం రద్దు చేయించారని, తాను పార్టీలో చేరేముందు సీఐ బదిలీ షరతు కూడా ఉందని లోకేష్‌కు గుర్తు చేశారు.
కనీసం బదిలీలు కూడా చేయకపోతే తానిక పార్టీలో చేరి ఏమి ఉపయోగమని రవి వాపోయినట్లు సమాచారం. అశోక్‌రెడ్డి మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు, రామారావు మాజీ ఎమ్మెల్యే దివిశివరాం మీద ఫిర్యాదు చేసి, సీఐ, ఆర్డీఓ, ఎమ్మార్వో, ఎస్‌ఐల జాబితాను లోకేష్‌కు అందించారు. అయితే లోకేష్ వారికి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంతో నిరాశ చెందారు. నిజానికి వీరిని టిడిపికి అనుకూల మీడియాగా ఉన్న, ప్రకాశం జిల్లా జర్నలిస్టు సంఘం నేత ఒకరు విజయవాడకు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. సదరు జర్నలిస్టు చొరవతోనే ఆ అధిపతి రాయబారంతో వైసీపీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినట్లు రెండు పార్టీల్లోనూ ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.
ప్రకాశం జిల్లాలో మొదలైన ఈ గొడవ రాష్ట్రం మొత్తానికి విస్తరిస్తోంది. జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి-వైసీపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి; నంద్యాలలో భూమా-శిల్పా; ఆళ్లగడ్డలో అఖిలప్రియ- ఇరిగెల రాంపుల్లారెడ్డి; కర్నూలులో టిజి వెంకటేష్-ఎస్వీ మోహన్‌రెడ్డి- కదిరిలో చాంద్‌పాషా- ప్రసాద్ తమ మనుషులకు పోస్టింగులివ్వాలని కోరుతూ జాబితాలు సిద్ధం చేసుకుంటున్నారు.
అయితే, నియోజకవర్గాల్లో కొన్ని మండలాలను విభజించి, రెండు వర్గాలు సూచించిన వారికి పోస్టింగులు ఇవ్వడం ద్వారా, ఈ గొడవలకు తెర దింపాలని యోచిస్తోంది.