తెలంగాణ

వెళ్లేవారు వెళ్లిపొండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 16: పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించి బేరసారాలు, ప్రలోభాలతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, టిఆర్‌ఎస్ కుటిల రాజకీయాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ న్యాయపోరాటం సాగిస్తుందని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. గురువారం మహారాష్టల్రోని యవత్‌మాల్ జిల్లాలో జరిగే రైతు సదస్సులో పాల్గొనేందుకు వెళ్తూ దిగ్విజయ్‌సింగ్ ఆదిలాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌లో సాగుతున్న వలసల పరంపరపై ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో యువరక్తం ఉరకలేస్తోందని, పార్టీని వీడాలనుకునేవారు ఊగిసలాట లేకుండా వెంటనే వెళ్ళిపోవాలని సూచించారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తే కఠినంగా వ్యవహరిస్తామని నేతలకు ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ తరపున ఎన్నికల్లో గెలిచి కాంట్రాక్ట్‌లు, రాజకీయ స్వప్రయోజనాలు, తమ ఆస్తులు కూడబెట్టుకునేందుకు పార్టీ మారిన నేతలంతా బేషరతుగా తమ పదవులకు రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో మరోసారి పోటీకి సిద్ధపడాలని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి 800 కోట్ల ప్రాజెక్టు కాంట్రాక్ట్ పనులు దక్కించుకునేందుకే టిఆర్‌ఎస్‌కు వలస వెళ్ళారని, పార్టీ మారిన నేతల బండారం, కెసిఆర్ ప్రలోభాలను ప్రజల ముందు ఎండగడ్తామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టంపై కాంగ్రెస్ అధ్వర్యంలో ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడమే గాక వారిపై చర్యలు తీసుకునే వరకు న్యాయపోరాటం సాగిస్తామని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి నిత్యం అబద్ధాలతో రాజకీయ పబ్బం గడుపుతున్న మోదీ సర్కారు, కెసిఆర్‌లకు ఈ దేశంలో ఎవరూ సాటిరారని ఆరోపించారు. ముస్లిం మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కెసిఆర్ మభ్యపెట్టి మోసం చేస్తే మరోవైపు విదేశాల్లో మగ్గుతున్న 15 లక్షల కోట్ల నల్లధనాన్ని వంద రోజుల్లోనే వెనక్కితెస్తామన్న నరేంద్ర మోదీ ఇంతవరకు నయాపైసా తీసుకురాలేకపోయారని అన్నారు. 2013లో యూపిఏ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా అమల్లోకి తెచ్చిన భూసేకరణ చట్టాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం తుంగలో తొక్కి రైతుల జీవనాధారమైన భూములను బలవంతంగా లాక్కోవడం సమంజసం కాదన్నారు. ఈ చట్టం నిబంధనల ప్రకారం భూనిర్వాసితులకు శాశ్వతమైన ఉపాధితో పాటు మార్కెట్ ధరకు తగ్గకుండా నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలతో ప్రాజెక్టులు నిర్మిస్తే చూస్తూ ఊరుకోబోమని దిగ్విజయ్ స్పష్టం చేశారు.
123 భూసేకరణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న హయంలో రైతులకు సంబంధించి 72 వేల కోట్ల పంట రుణాలు మాఫీ చేసి రైతులను ఆదుకున్నామని, కెసిఆర్ ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీ పేరిట రెండేళ్లలో రెండు విడతల రుణం మాఫీ చేసి వారిపై వడ్డ్భీరాన్ని మోపిందని ఆరోపించారు. రెండు పడకగదులు నిర్మిస్తామన్న కెసిఆర్ రెండేళ్లలో ఎన్ని గృహాలు నిర్మించారో సమాధానం చెప్పాలని దిగ్విజయ్ సవాలు చేశారు. దళితులకు మూడెకరాల భూమి, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల పేరిట ప్రభుత్వం మోసపూరిత విధానాలకు పాల్పడుతోందని విమర్శించారు. కొత్త పరిశ్రమలు ఒక్కటి కూడా తెరవకపోగా వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై కత్తివేలాడదీస్తూ ఉపాధి అవకాశాలు లేకుండా చేస్తోందని టిఆర్‌ఎస్ సర్కారుపై దిగ్విజయ్ మండిపడ్డారు. ఈ విలేఖరుల సమావేశంలో డిసిసి అధ్యక్షుడు మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూన్నఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్