ఆంధ్రప్రదేశ్‌

రైతులకు ప్లాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 19: ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూములిచ్చిన రైతులకు నేటినుంచి ప్లాట్ల పంపిణీ జరగనుంది. సోమవారం నేలపాడు గ్రామం నుంచి పంపిణీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. లాటరీ పద్ధతిన రైతులు కోరుకున్న ప్రాంతాల్లో ప్లాట్లను సీఆర్డీఎ అధికారులు కేటాయిస్తారు. సాయంత్రం 4 గంటలకు నేలపాడు సిఆర్డీఎ కార్యాలయానికి రైతులు తరలిరావాలని అధికారులు కోరారు. ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లకు వినియోగించే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల తరహాలో ర్యాండమ్ విధానాన్ని అనుసరించనున్నారు. ఒక రైతు ఒకే వైశాల్యం కల్గిన స్థలాలు రెండు లేక మూడు కోరుకుంటే పక్కపక్కనే అప్పగించేందుకు లే-అవుట్‌లు సిద్ధం చేశారు. తమకు ఏ వైశాల్యం కలిగిన స్థలాలు ఎన్ని కావాలో ఇప్పటికే రైతులు 9.18 ఫారం ద్వారా సిఆర్‌డిఎకు అందజేశారు. దీని ఆధారంగా నేలపాడు గ్రామానికి సంబంధించి తుది లే అవుట్‌ను రూపొందించారు. లాటరీ ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. ప్లాట్ల కేటాయింపు అనంతరం మూడు వారాల్లోగా లే అవుట్లకు మార్కింగ్ చేసి ఎవరి స్థలం ఎక్కడ ఉందనేది నిర్ధారిస్తారు. తర్వాత రైతులకు యాజమాన్య హక్కు పత్రాలను పంపిణీ చేస్తారు. దీనివల్ల రైతులు తమ భూములకు సంబంధించి అసలు డాక్యుమెంట్లను సిఆర్‌డిఎకు ఇవ్వాల్సి ఉంది. తమ భూములను సిఆర్‌డిఎ పేరు మీద రిజిస్టర్ చేస్తే రైతులకు కేటాయించిన ప్లాట్లను వారి పేర్ల మీద సిఆర్‌డిఎ రిజిస్టర్ చేస్తుంది. నివాస స్థలాలకు సంబంధించి జిప్లస్ 3 మొదలు జిప్లస్ 11 అంతస్తుల వరకు అనుమతి ఉంటుంది. ఐదు కేటగిరిలుగా నివాస స్థలాలను వర్గీకరించారు. ఇందులో ఎ కేటగిరి కింద 120 - 210 చదరపు గజాలు, బి కేటగిరి కింద 250 - 450, సి కేటగిరి పరిధిలో 480 - 1410, డి కేటగిరి కింద 1440 - 5940, ఈ కేటగిరి కింద 6000 నుంచి 25000 చదరపు గజాలు పంపిణీ చేస్తారు. వాణిజ్య ప్రాంతంలో జి కేటగిరి కింద 30 గజాలు, హెచ్ కేటగిరి కింద 60 - 180, ఐ కేటగిరిలో 210 - 270, జె కేటగిరిలో 300 - 420, కె కేటగిరిలో 450 నుండి 1290 చదరపు గజాలు, ఎల్ కింద 1320 - 3570, ఎంలో 3600 నుంచి 25000 చదరపు గజాల ప్లాట్లను లే అవుట్లలో ఏర్పాటుచేశారు. కమర్షియల్ ఏరియాలో జి ప్లస్ -1 నుంచి జి ప్లస్-8 వరకు అనుమతి ఉంటుంది. అయితే ఈ స్థలాల్లో నివాస స్థలాలు, వృద్ధాశ్రమాలు, ఇతర వాణిజ్యేతర సంబంధిత నిర్మాణాలకు అనుమతి ఇవ్వరు. అదేవిధంగా నివాస భవనాలకు కేటాయించే ప్లాట్లలో హోటళ్లు, సినిమాహాళ్లు, పార్కులు, ఇతర వాణిజ్య సంబంధిత నిర్మాణాలు నిషేధం. జరీబు భూములకు సంబంధించి ఎకరానికి 1200 గజాలు నివాస స్థలాలు, 800 గజాల వాణిజ్య ప్లాట్లు, మెట్ట భూములు ఇచ్చిన రైతులకు ఎకరానికి 1000 గజాల నివాస స్థలంతో పాటు 800 గజాల వాణిజ్య సముదాయ ప్రాంతాల్లో ప్లాట్లు పంపిణీ చేస్తారు. సిఆర్‌డిఎ నిబంధనల ప్రకారం విభజించిన ప్లాట్లలో కొంత స్థలం మిగిలితే ఆ స్థలాన్ని సిఆర్‌డిఎకు అప్పగించవచ్చు. మార్కెట్ ధర ప్రకారం సిఆర్‌డిఎ బిట్లను విక్రయించి ఆ సొమ్మును రైతులకు చెల్లిస్తుంది లేదా రైతుల అభీష్టం మేరకు ఇద్దరు ముగ్గురు కలిసి ప్లాట్లలో మిగిలిన స్థలాలను వారే విక్రయించుకోవచ్చు. సిఆర్‌డిఎకు అప్పగిస్తే టిడిఆర్ బాండ్లను రైతులకు అందజేస్తారు. తొలి విడతగా నేలపాడు గ్రామంలో సుమారు 750 మంది రైతులకు ప్లాట్లు పంపిణీ చేయనున్నారు. వచ్చే నెల 10వ తేదీలోగా రాజధాని ప్రతిపాదిత గ్రామాలన్నింటిలో రైతులకు ప్లాట్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

చిత్రం...నేలపాడులో రైతుల ప్లాట్లకు మార్కింగ్ ఇస్తున్న దృశ్యం