ఆంధ్రప్రదేశ్‌

పదకొండో రోజుకు ముద్రగడ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 19: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో ముద్రగడ దంపతుల ఆమరణ నిరాహార దీక్ష ఆదివారం పదకొండో రోజూ కొనసాగింది. ఆదివారం ఆయనకు ఎకో పరీక్ష చేశారు. నివేదికలన్నీ బాగానే ఉన్నప్పటికీ ఆరోగ్యం మాత్రం ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏ క్షణమైనా గుండె సంబంధిత ఆస్పత్రికి తరలించడానికి ప్రభుత్వాసుపత్రి వైద్యులు అన్ని ఏర్పాట్లుచేశారు. రాజమహేంద్రవరంలోని బొల్లినేని ఆస్పత్రికి తరలించడానికి వీలుగా అవసరమైన అన్ని ఏర్పాట్లు సిద్ధంచేశారు. ముద్రగడ కంటే ఆయన సతీమణి పద్మావతి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉన్నట్టు గుర్తించిన వైద్యులు ఈమేరకు ఆదివారం ఉదయం ప్రభుత్వానికి నివేదిక పంపించినట్టు తెలిసింది. వైద్యులు బయటకు ఒకరకంగా చెబుతుండగా, ప్రభుత్వానికి ఒక నివేదిక పంపిస్తున్నట్టు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందరికీ బెయిలు వస్తేనే ముద్రగడ నిరాహారదీక్ష విరమించే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇంకా సమస్య జఠిలంగానే ఉంది. తుని ఘటనకు సంబంధించి మొత్తం పదమూడు మంది రిమాండ్‌కు వెళ్లగా అందులో ఇప్పటివరకు పదిమందికి బెయిల్ లభించింది. ఇందులో ఒకరిని మళ్లీ సిఐడి కస్టడీకి తీసుకున్నారు. మరొకరికి సాంకేతిక లోపం తలెత్తి బెయిల్ దక్కలేదు. మరో నలుగురుకి సోమవారం బెయిల్ వస్తుందని ఆశిస్తున్నారు. అంతా సవ్యంగా జరిగి నలుగురికి బెయిల్ లభించి బయటకు వస్తే సోమవారం రాత్రికల్లా దీక్ష సుఖాంతమవుతుందని అంతా ఎదురుచూస్తున్నారు. లేదంటే మంగళవారం వరకు సాగినా సాగొచ్చని తెలుస్తోంది. ఈ సమస్య ఎంత త్వరగా ముగుస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. కాపు జెఎసిలో కీలక భూమిక పోషిస్తున్న రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఒత్తిడి మేరకు ముద్రగడ పద్మనాభం చిన్న కుమారుడు గిరి, కోడలు సిరి శనివారం రాత్రి తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల మధ్య దీక్ష విరమించారు. వారిని మెరుగైన వైద్యం నిమిత్తం కుటుంబ సభ్యులు విశాఖపట్నం తీసుకెళ్ళారు. దీంతో ప్రస్తుతం ముద్రగడ దంపతులు మాత్రమే దీక్ష కొనసాగిస్తున్నారు. ముద్రగడ కంటే ఆయన సతీమణి ఆరోగ్యం మరింత ఆందోళనకరంగా ఉందని బంధువులు చెబుతున్నారు. సోమవారం నాటికి కీలకమైన ముగ్గురికి బెయిలు లభిస్తే దీక్ష విరమించే అవకాశం వుంది. దీక్ష రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో విరమిస్తారా లేక కిర్లంపూడి వెళ్లి, అక్కడ విరమిస్తారా అనేది తేలాల్సివుంది.