తెలంగాణ

సుల్తాన్‌బజార్‌లో భారీ చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: నగరంలోని సుల్తాన్ బజార్‌లో గత రాత్రి ఓ వ్యాపారి నుంచి రూ. 12 లక్షలు దోచుకెళ్లిన ఐదుగురు దొంగలను ఈస్ట్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 12 లక్షలు అపహరించిన చోరీ కేసును 12 గంటల లోపే పోలీసులు ఛేదించారు. రాజధాని టైర్స్ షో రూమ్ అధినేత దినేష్ సింగ్ తన నగదు రూ. 12 లక్షలతో బైక్‌పై వెళ్తుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇద్దరు దుండగులు వ్యాపారి బైక్‌ను ఢీకొట్టారు. దీంతో వ్యాపారి దినేష్ సింగ్ బైక్ పైనుంచి కిందపడిపోగా దోపిడీ దొంగలు క్యాష్ బ్యాగ్, బైక్‌ను ఎత్తుకెళ్లారు. బాధితులు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. దోపిడీకి పాల్పడిన ఐదుగురిని ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్ రవీందర్ తెలిపారు. మంగళ్‌హాట్‌కు చెందిన ఆశిష్ సింగ్, కుల్సుంపురాకు చెందిన జగదీష్, అలియాబాద్‌కు చెందిన మహమ్మద్ అమీర్, మంగళ్‌హాట్‌కు చెందిన రాజామిశ్రా పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. కుల్సుంపురాకు చెందిన మల్లికార్జున్, జల్‌పల్లికి చెందిన హబీబ్ పరారీలో ఉన్నారు. పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్టు ఈస్ట్‌జోన్ డిసిపి డాక్టర్ రవీందర్ తెలిపారు.

వృద్ధురాలి సజీవ దహనం
నర్సంపేట, జూన్ 19: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో పూరిగుడిసె దగ్ధమై ప్రమాదవశాత్తు అందులో నిద్రిస్తున్న ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం కమ్మపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కమ్మపల్లి గ్రామానికి చెందిన అల్లె సాయమ్మ (65) కూలీ పనిచేస్తుకుంటూ జీవనం కొనసాగిస్తుంది. సాయమ్మ గత కొంతకాలం క్రితం భర్త చనిపోవడంతో సాయమ్మ ఒక్కరే పూరిగుడిసెలో ఉంటున్నారు. రోజు వారి వృత్తిలో భాగంగా శనివారం కూడా కూలీకి వెళ్లి తిరిగి వచ్చింది. సాయంత్రం పనులను ముగించుకుని రాత్రి నిద్రకు ఉపక్రమించింది. ప్రమాదవశాత్తు రాత్రి 11గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌కు గురై గుడిసెకు నిప్పంటుకుంది. స్థానికులు గమనించి మంటలార్పేందుకు బిందెల్లో నీళ్లు తెచ్చి పోస్తున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ స్థంభం వద్ద ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో స్థానికులు గమనించి విద్యుత్ సరఫరాను నిలిపివేసి వచ్చి మంటలను ఆర్పేశారు. అప్పటికే పూరిగుడిసె పూర్తిగా దగ్ధవడంతో సాయమ్మ సజీవదహనమైంది. ఆమెకు ముగ్గురు కుమారులు, కుమార్తె ఉన్నారు. ఆదివారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో నర్సంపేట టౌన్ సిఐ జాన్‌దివాకర్, ఎస్సై నారాయణరెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.

మళ్లీ మావోల అలజడి
కలకలం సృష్టిస్తున్న ఎన్‌కౌంటర్

హైదరాబాద్, జూన్ 19: ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మళ్లీ మావోల అలజడి మొదలైంది. ఇసుక ట్రాక్టర్ల ధ్వంసం, పోలీసు వాహనాల దగ్ధం వంటి సంఘటనల నేపథ్యంలో గ్రేహౌండ్ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. తెలంగాణ, మహరాష్ట్ర సరిహద్దులో ఆదివారం తెల్లవారు జామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. పక్షం రోజుల నుంచి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ చేపట్టారు. గడ్చిరోలి జిల్లా కమలాపూర్ అటవీ ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారని, ఘటనా స్థలంలో ఎకె 47, ఎస్‌ఎల్‌ఆర్‌తోపాటు విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్టు మహరాష్ట్ర గ్రేహౌండ్స్ పోలీసులు వెల్లడించారు. కాగా మృతులు ఆదిలాబాద్ డివిజన్ దళ కమాండర్ శోభన్, మరో ఇద్దరు దినేష్, ముఖేష్‌లుగా గుర్తించారు. దీనిపై ఆదిలాబాద్ పోలీసులు మహరాష్ట్ర పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. మృతదేహాలను గడ్చిరోలి జిల్లా కేంద్రానికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లా సరిహద్దు కావడంతో రెండు జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇదిలావుండగా మృతుడు ఆదిలాబాద్ డివిజన్ దళకమాండర్ శోభన్‌పై 20 కేసులు ఉన్నాయని, ఐదు లక్షల రివార్డు కూడా ఉందని ఆదిలాబాద్ పోలీసులు తెలిపారు. జిల్లాలోని బెజ్జూరు, కరీంనగర్ సరిహద్దు ప్రాంతాలైన మహదేవపూర్, కమాన్‌పూర్‌లలో పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారు. మావోయిస్టులు ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చని సరిహద్దు జిల్లాల్లో ప్రత్యే పోలీసు దళాలు గస్తీ ముమ్మరం చేశారు.