రాష్ట్రీయం

మత్తుపదార్ధాల విక్రయాలపై నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 20: వైట్నర్, ఇతర చౌక రకం మత్తు పదార్ధాలకు బానిసలవుతున్న బాలలను ఆదుకోవాలని, ఈ మత్తు పదార్ధాల విక్రయాలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. నెల్లూరు చారిటబుల్ ట్రస్టుకు చెందిన వసంతలక్ష్మి అనే నిర్వాహకురాలు వైట్నర్ తదితర మత్తు పదార్ధాలను బాలలకు విక్రయించడంపై ఆంక్షలు విధించాలని, అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌ను విచారించారు. పేద బాలలు వీటికి బానిసై భవిష్యత్తును కోల్పోతున్నారని, మృత్యు వాతపడుతున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ తరఫున న్యాయవాది హాజరై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ పదార్ధాలు డ్రగ్స్, కాస్మిటిక్స్ చట్టం పరిధిలోకి రావన్నారు. అందుకే వైట్నర్ తదితర పదార్ధాలను నిషేధించలేకపోతున్నామన్నారు. అనంతరం హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వలను నవంబర్ 30వ తేదీలోగా పిటిషనర్ పేర్కొన్న అంశాలపై, వైట్నర్ తదితర మత్తు పదార్ధాలను బాలలకు విక్రయించకుండా నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు విచారణను నవంబర్ 30వ తేదీకి వాయిదా వేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ భి భోంస్లే, జస్టిస్ ఎస్‌వి భట్ విచారించారు.