ఆంధ్రప్రదేశ్‌

నేడు ముద్రగడ దీక్ష విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 20: మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం మంగళవారం దీక్ష విరమించే అవకాశం ఉంది. తాను డిమాండు చేసినట్టుగా తుని కేసులకు సంబంధించి పదమూడు మందికి బెయిలు మంజూరు కావడంతో ఎట్టకేలకు ఆయన దీక్ష విరమించడానికి మార్గం సుగమమైంది. కాపు జెఎసి నేతలు జరిపిన చర్చల సందర్భంగా 13మంది బెయిలుపై విడుదలయ్యాక దీక్ష విరమిస్తానని ముద్రగడ పేర్కొన్న సంగతి విదితమే. ఈ కేసుల్లో ఇప్పటికే 10మందికి బెయిలు మంజూరై విడుదలకాగా, సోమవారం మిగిలిన ముగ్గురికి బెయిలు మంజూరయ్యింది. అయితే రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న వీరు లాంఛనాలు పూర్తిచేసుకుని మంగళవారం విడుదలయ్యే ఆవకాశముంది. ఈ నేపథ్యంలోనే ఆయన మంగళవారం కిర్లంపూడిలో దీక్ష విరమిస్తారని భావిస్తున్నారు. కిర్లంపూడిలో దీక్ష ప్రారంభించిన తనను అక్కడి నుండి తీసుకువచ్చిన అధికారులు, తిరిగి అక్కడకు చేర్చిన అనంతరం దీక్ష విరమించాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలిసింది. సోమవారం సాయంత్రానికి అందరికీ బెయిల్ వచ్చింది కాబట్టి దీక్ష విరమించవలసిందిగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ విజయకృష్ణన్, అర్బన్ ఎస్పీ రాజకుమారి, మరికొంతమంది కుటుంబ సభ్యులు ముద్రగడకు విజ్ఞప్తిచేసినట్టు సమాచారం. అయితే 13మంది బయటకు వచ్చిన తర్వాతే దీక్ష విరమించేదని చెబుతూ ముద్రగడ సున్నితంగా తిరస్కరించినట్టు తెలియవచ్చింది.
మరోవైపు ముద్రగడ ఆరోగ్యం రోజు రోజుకూ విషమంగా మారుతోంది. ఆయనతో పాటు దీక్షలో ఉన్న సతీమణి పద్మావతి ఆరోగ్యం మరింత విషమంగా మారుతోంది. రక్త పరీక్షలకు అంగీకరించని ముద్రగడ సోమవారం ఉదయం అధికారులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు అంగీకరించారు. ఆరోగ్య పరిస్థితి కొంత సంక్లిష్టంగా ఉన్న కారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే ప్రైవేటు ఆస్పత్రికి తరలించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ముద్రగడను కాకపోయినా ఆయన సతీమణినైనా ఒప్పించి, ప్రైవేటు ఆస్పత్రికి తరలించడానికి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో అంబులెన్స్‌ను సిద్ధంచేశారు. ఎక్కువ రోజులు సెలైన్లపై వైద్యం చేయలేమని వైద్యులు చెబుతున్నారు. గత నాలుగు రోజుల నుంచి సెలైన్లు ఎక్కిస్తుండగా, సోమవారం ఉదయం ఒక డిఎన్‌ఎస్ సెలైన్, ఒక నార్మల్ సెలైన్ ఎక్కించినట్టు వైద్యులు చెప్పారు. ముద్రగడకు షుగర్ లెవెల్ 154, బీపీ 130/80, పల్స్ 84 వుందని సోమవారం ఉదయం వైద్యులు తెలియజేశారు. ముద్రగడ భార్య పద్మావతి పల్స్ 88, షుగర్ లెవెల్ 80, బీపీ 140/80 ఉన్నట్టు తెలిపారు. కీటోన్ బాడీస్ నార్మల్ గా అయితే 0.6 వుండాల్సి వుండగా ముద్రగడకు ప్లస్ టూ, ఆయన భార్యకు ప్లస్ త్రీ వున్నట్టు వైద్యులు వెల్లడించారు. ముద్రగడకు ఎకో, టూడీ ఎకో పరీక్షలు చేయించామని అన్ని నార్మల్‌గా ఉన్నాయని ప్రకటించారు.