రాష్ట్రీయం

2016-17 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 14: 2016-17 ఆర్థిక సంవత్సరానికి పారదర్శకతతో పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టదలిచామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఖర్చుచేసే ప్రతి పైసా పూర్తి పారదర్శకత, వాస్తవికతకు లోబడి మాత్రమే జరగాలని, అందుకనుగుణంగా బడ్జెట్‌ను రూపొందించడం, కేటాయింపులు జరపాలని స్పష్టం చేశారు. విజయవాడలో సోమవారం ప్రారంభమైన రెండు రోజుల కలెక్టర్ల సమావేశంలో తొలిరోజు ప్రారంభోపన్యాసం అనంతరం రానున్న బడ్జెట్‌పై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ పివి రమేష్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై వివరణ ఇస్తూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులు, ఖర్చులు రానున్న ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌పై వచ్చిన ప్రతిపాదనలను వివరించారు. రాష్ట్రంలోని 20,361 మంది డ్రాయింగ్ అధికారులకు గాను 14వేల 265 మంది అధికారులు, వారి శాఖాపరమైన ఉద్యోగులు అంశాలను నమోదు చేశారని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలకు చెంది కేవలం 9వేల 621 మంది డిడివోలు వారి కార్యాలయాలకు బడ్జెట్ కేటాయింపులను కోరారన్నారు. ఆయా శాఖల, డిడివోల కార్యాలయాలకు సంబంధించి బడ్జెట్, జీతభత్యాల ప్రతిపాదనలను ఈనెల 21లోగా సమర్పించకపోతే 2016-17 ఆర్థిక సంవత్సర బడ్జెట్ కేటాయింపులు జరగవని, వారికి సంబంధిత అధికారి బాధ్యత వహించాల్సి వుందన్నారు. 2016 ఏప్రిల్ 1 నుండి పూర్తిస్థాయిలో ఖర్చుల ప్రాతిపదికనే బడ్జెట్, ఉద్యోగుల జీతభత్యాలకు, కార్యాలయ నిర్వహణ, ఇతర పనులకు కేటాయింపులు జరుగుతాయని చెప్పారు. హేతుబద్ధీకరణ విధానంలో బడ్జెట్ నిధులు కేటాయింపు జరుగుతుందని, ఏ నెలకు ఎంతమొత్తంలో బడ్జెట్ కావాలో వాస్తవ ఖర్చు ఆధారంగా నూరుశాతం నిధులను ముందస్తుగానే మంజూరు జరుగుతుందన్నారు. 1417 రకాలైన పద్దులను సమీక్షించి వాటికి అనుబంధ బడ్జెట్ పద్దులతో అనుసంధానించడం, లేక తొలగించడం జరిగిందని వివరించారు. డిడివోలు పంపిన ప్రతిపాదనలను ఆయా శాఖల సెక్రటేరియట్ విభాగపు అధికారులు సంగ్రహపరిచి ఆన్‌లైన్ ద్వారా ఆర్థిక శాఖకు సమర్పించాలని పివి రమేష్ తెలిపారు. ఈ మొత్తం ప్రక్రియ డిసెంబరు 31 నాటికి పూర్తిచెయ్యడం ద్వారా 2016-17 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌పై ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు వెళ్లగలుగుతామన్నారు. జిల్లా స్థాయిలో, డిడివో స్థాయిలో పంపే ప్రతిపాదనలకు డిసెంబర్ 21 వరకు అనుమతి పొడిగిస్తూ ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని, తప్పనిసరిగా డిడివోల పరిధిలో చేపట్టవలసిన సంబంధిత వివరాలను వెంటనే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని తెలిపారు. గ్రామాల్లో, వౌలిక వసతుల అభివృద్ధికి జన్‌ధన్ - ఆధార్ అనుసంధానం - ఆర్థిక చేకూర్పు విధానంలో పారదర్శకతతో కూడిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. నగదు రహిత అభివృద్ధి కోసం నేరుగా నగదు లావాదేవీలు ఆధార్ సంఖ్య పారదర్శకత సాధించగలుగుతామన్నారు.

మరో రెండు వెబ్ పోర్టల్స్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఇ-సేవలో మరో రెండు పోర్టల్స్ చేరాయి. కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇ-స్పందన, డిజిటల్ పంచాయతీ అనే రెండు వెబ్ పోర్టల్స్‌ను ప్రారంభించారు. డిజిటల్ పంచాయతీ వెబ్ పోర్టల్‌లో వివాహ ధృవీకరణ పత్రం నుంచి, ఆస్తి విలువ పత్రం, మ్యూటేషన్, మంచినీటి కుళాయి కనెక్షన్, ఎన్‌ఓసీ, భవన నిర్మాణాల అనుమతులు, లేఔట్ అనుమతులు, జనన, మరణాల నమోదు, ఇంటిపన్ను చెల్లింపు, వృత్తి లైసెన్స్, ఉపాధి హామీ పనులు, జాబ్‌ఛార్ట్ వంటి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందించనున్నారు. అవినీతిని నియంత్రించటానికి పరిపాలనను పారదర్శకంగా ఉంచటానికి డిజిటల్ సేవలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అంతకుముందు ముఖ్యమంత్రి ఐటీ శాఖ రూపొందించిన ఇ-స్పందన పోర్టల్‌ను ఆవిష్కరించారు.

నేడు డబుల్ డిజిట్ ప్రణాళికలు
కలెక్టర్ల సమావేశంలో రెండోరోజైన మంగళవారం జిల్లాలవారీ కలెక్టర్లు, మంత్రులతో రెండంకెల అభివృద్ధిపై సమీక్షలు జరగనున్నాయి. ఇదే సమయంలో ప్రణాళికలను కూడా రూపొందించనున్నారు. రెండంకెల వృద్ధి ప్రగతిపై జిల్లాల పాత్రపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్ సమావేశంలో ప్రసంగిస్తారు. దీనిపై ఎస్‌టి ఠక్కర్, డాక్టర్ దక్షిణామూర్తి వివరిస్తారు. అనంతరం మలేషియా పెమెండో పద్ధతిపై మలేషియా ప్రధాని కార్యాలయ అధికారులు వివరాలను అందిస్తారు. మధ్యాహ్నం నుంచి సూక్ష్మధాతువులు, బిందు ప్రణాళిక, పాల ఉత్పత్తి రంగం, మత్స్య, రొయ్యల ఉత్పత్తిపై ప్రణాళికలు, పరిశ్రమలు, రుణ ప్రణాళిక, జన్మభూమి దరఖాస్తులు, నీరు-చెట్టు, గృహ నిర్మాణం, రోడ్లు, స్మార్ట్ విలేజ్, వయోజన విద్య, స్వయం సహాయ సంఘాలు వంటి అంశాలపై వెల్లడిస్తారు.