రాష్ట్రీయం

ఆంధ్ర అభివృద్ధికి బ్రిటన్ చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రిటన్ సంపూర్ణ సహకారం అందజేస్తుందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అస్‌క్వత్ హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో గురువారం ఆయన ఏపి సిఎం చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లారు. వీరిద్దరి భేటీ సందర్భంగా అమరావతి అభివృద్ధి కోసం ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు, వౌలిక సదుపాయాల కల్పనకు బ్రిటన్‌కున్న అవకాశాలు, సాధ్యాసాధ్యాలపై హైకమిషనర్ ముఖ్యమంత్రికి ప్రెజెంటేషన్ ఇచ్చారు. పట్టణ ప్రజా రవాణా రంగం ప్లానింగ్‌కు సహకారం అందజేస్తామని, అమరావతిలో పెట్టుబడులు పెట్టేలా బ్రిటిష్ ప్రైవేట్ రంగాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తామని హైకమిషనర్ వివరించారు. బ్రిటన్, ఏపీల మధ్య పరస్పర సహకారానికి ప్రాధాన్యతనిస్తున్నట్లు చెప్పారు. నైపుణ్య శిక్షణ వైద్యసేవలు, ఐటి, వౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ మరింత వృద్ధి సాధించటానికి తాము తోడ్పడతామన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతో సృజనాత్మకత, నైపుణ్యాలు కలిగిన వారని, ప్రపంచంలోని నలుమూలలా ఆంధ్రులు ఉన్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. గుజరాత్ తర్వాత దేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌కు ఉందని, రాష్ట్ర భవిష్యత్తుకు తీర ప్రాంతం ఎంతగానో దోహదపడుతుందన్నారు. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నంలలో డీప్ సీ వాటర్ పోర్టులున్నాయని, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాలుగా అభివృద్ధి చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో లాజిస్టిక్ హబ్‌గా రూపొందుతుందని, చెన్నయ్-విశాఖ, చెన్నయ్-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నట్లు బ్రిటిష్ హైకమిషనర్‌కు చంద్రబాబు వివరించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజాలు, చమురు సహజ వాయు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు.

చిత్రం చంద్రబాబుతో సమావేశమైన బ్రిటిష్ హై కమిషనర్