రాష్ట్రీయం

‘ద్రావిడ’ పిహెచ్‌డి అడ్మిషన్లపై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ద్రావిడ విశ్వవిద్యాలయం 8వేల మందికి ఎం.్ఫల్, పిహెచ్‌డి కోర్సుల్లో ప్రవేశాలు ఇవ్వడంపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దర్యాప్తు నిర్వహించడం సబబేనని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. విద్యార్ధుల జీవితాలతో చెలగాటమాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలిప్ బి బోసలే, జస్టిస్ పి నవీన్ కుమార్‌లతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. ద్రావిడ విశ్వవిద్యాలయం ఎలాంటి సౌకర్యాలు లేకుండా పరిమితికి మించి ఎంఫిల్, పిహెచ్‌డి కోర్సుల్లో వేలల్లో అడ్మిషన్లను చేయడం వెనుక అనేక అక్రమాలు జరిగాయని భావించిన రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే జె ప్రసాద్ బాబు సహా 14 మంది సిఐడి విచారణను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. దానిపై అప్పట్లో హైకోర్టు న్యాయమూర్తి స్టే ఇచ్చేందుకు నిరాకరించారు. స్వతంత్రప్రతిపత్తి ఉన్న విశ్వవిద్యాలయంపై ప్రభుత్వం ఎలా విచారణ జరపుతుందని వీరంతా వాదించారు. అయితే ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఎలాంటి పొరపాటు లేదని గతంలో న్యాయమూర్తి ప్రస్తావిస్తూ అభ్యర్ధనను తిరస్కరించారు. అయితే వారంతా హైకోర్టు బెంచ్‌ను ఆశ్రయించారు. తాత్కాలిక ప్రధానన్యాయమూర్తి అధ్యక్షతన బెంచ్ ఈ కేసును విచారిస్తూ అక్రమాలపై దర్యాప్తు కొనసాగిస్తే విద్యార్ధులకు వచ్చిన నష్టం ఏమిటని ప్రశ్నించింది. విద్యార్ధులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్యాప్తు కొనసాగించమని సిఐడిని గతంలోనే ఏకసభ్య న్యాయమూర్తి ఆదేశించారని బెంచ్ గుర్తుచేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని బెంచ్ స్పష్టం చేసింది. దాంతో పిటీషన్ దాఖలు చేసిన జె ప్రసాద్ బాబు న్యాయస్థానం అనుమతిస్తే పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని చెప్పడంతో కోర్టు అందుకు అనుమతించింది.