రాష్ట్రీయం

మా భూమి మాకివ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: న్యూఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణకు అప్పగించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఆయన గురువారం ఓ లేఖ రాశారు. ఎపి భవన్ ఆధీనంలో ఉన్న స్థలం హైదరాబాద్ రాష్ట్రానికి చెందిందని దానిపై పూర్తి హక్కు తెలంగాణకే ఉంటుందని ముఖ్యమంత్రి తన లేఖలో పేర్కొన్నారు. దేశ రాజధానిలో త్వరలో తెలంగాణ భవన్ నిర్మించాలని అనుకుంటున్నామని, ఎపి భవన్ ఆధీనంలో ఉన్న సదరు స్థలాన్ని తమకు అప్పగించడానికి సత్వర చర్యలు తీసుకోవాల్సిందిగా కెసిఆర్ కోరారు. నిజాం ప్రభుత్వం 1917, 1928, 1936లో మూడు బిట్లుగా ఢిల్లీలో 18.18 ఎకరాల స్థలాన్ని విదేశీ, రాజకీయ వ్యవహారాల శాఖ నుంచి కొనుగోలు చేసిందన్నారు. ఈ స్థలంలోనే ప్రస్తుతం హైదరాబాద్ హౌజ్, తెలంగాణ భవన్, ఎపి భవన్‌లు ఉన్నాయన్నారు, వీటిలో హైదరాబాద్ హౌజ్‌ను కేంద్రం తీసుకొని దానికి బదులుగా పటౌడి హౌజ్‌లో 7.56 ఎకరాలు, నర్సింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో 1.21 ఎకరాలను కేటాయించిందని సిఎం వివరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ స్థలం హైదరాబాద్‌కు స్టేట్‌కు బదలాయించారని పేర్కొన్నారు. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లేదని, ఆంధ్రప్రాంతమంతా మద్రాస్ రాష్ట్రంలో ఉందన్నారు. 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడటంతో ఆ స్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదలాయించారన్నారు. గతంలో హైదరాబాద్ స్టేట్‌గా ఉన్న ప్రాంతమే తెలంగాణ రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఢిల్లీలో ఎపి భవన్ ఆధీనంలోని స్థలం తెలంగాణకే చెందుతుందన్నారు. ఈ స్థలాన్ని రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాలకు మధ్య విభజించడానికి వీలులేదని సిఎం పేర్కొన్నారు. ఆంధ్రప్రాంతం మద్రాసు రాష్ట్రంలో కలిసి ఉండటంతో వారికి ఆ రాష్ట్రానికి చెందిన స్థలాన్ని విభజించాలి కానీ తమ రాష్ట్రానికి చెందిన స్థలంలో వాటా ఎలా ఇస్తారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. వాస్తవాలు, చారిత్రక ఆధారాలను పరిగణనలోకి తీసుకొని ఎపి భవన్ ఆధీనంలో ఉన్న స్థలాన్ని తెలంగాణ రాష్ట్రానికి అప్పగించాలని ముఖ్యమంత్రి తన లేఖలో కోరారు.