రాష్ట్రీయం

కోటి మొక్కలు నాటుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: బాబా రాందేవ్, జగ్గీ వాసుదేవ్‌ల సహకారంతో రాష్ట్రంలో ఓషధీ మొక్కల పెంపకం చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం నాడిక్కడ ఆయన మొక్కల పెంపకంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా రాష్ట్రంలోని రహదారులు, రైల్వేలేన్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. విమానాల ద్వారా అడవుల్లో పెద్దఎత్తున విత్తనాలు చల్లాలన్నారు. నందనవనం ప్రాజెక్టులను పూర్తిచేయటంతో పాటు ఎకో టూరిజం ప్రాజెక్టు బాధ్యతను అటవీశాఖ తీసుకోవాలన్నారు. అటవీశాఖలోనున్న ఖాళీలను గుర్తించి తక్షణం నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రపంచంలోని అన్ని రకాల మొక్కలను రాష్ట్రంలో నాటాలంటూ ఆయుర్వేదం మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. జూలై చివరి వారంలో కోటి మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. మొక్కల పెంపకానికి కృషి చేసిన వారికి విభాగాల వారీగా అవార్డులిచ్చి ప్రోత్సహించాలన్నారు. మొక్కల పెంపకం, పర్యవేక్షణ కూడా ముఖ్యమని బయో ఫెన్సింగ్, జియో ట్యాగింగ్ వంటి రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
స్వాధీనం చేసుకున్న ఎర్రచందనాన్ని ఎబిసి కేటగిరీలుగా వేరుచేసి భద్రపర్చటమే గాక కొత్తగా మొక్కల పెంపకాన్ని చేపట్టాలన్నారు. ఆపై వేలం కోసం కూడా కలిపి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసే ఆలోచనను చేయాలని సిఎం సూచించారు. ఎర్రచందనం పరిరక్షణకు జియో ట్యాగింగ్, డ్రోన్ వంటి వాటిని విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని వేలంలో ఎక్కువ ఆదాయం వచ్చేలా చూడాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,095 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం నిల్వలున్నాయని, వీటి మార్కెటింగ్ కోసం చైనాలో ఒక డిపో ఏర్పాటు చేయటంతో పాటు చైనీస్ కరెన్సీ యువాన్‌లలో కూడా ఎర్రచందనం వేలం వేసే ఆలోచన చేయాలని సిఎం ఆదేశించారు.